ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడైన చంద్రశేఖర్ ఆజాద్ జూలై 23, 1906న మధ్యప్రదేశ్‌లోని భభ్రా (చంద్రశేఖర్ ఆజాద్ నగర్) లో జన్మించాడు. విద్యార్థిదశలోనే స్వాతంత్రోద్యమంలో ప్రవేశించిన ఆజాద్‌కు తన స్నేహితుడైన రాంప్రసాద్ బిస్మిల్ లాంటి వారి భావాలవల్ల బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి. ఆగస్టు 9, 1924 న ఈ విప్లవకారులంతా కలిసి ప్రభుత్వ ధనం ఉన్న రైలును ఆపి దోపిడి చేశారు.
1928 సెప్టెంబరులో భగత్ సింగ్, సుఖ్ దేవ్ మొదలగు వారితో కలిసి హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. వీరందరూ కలిసి లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిని చంపాలనుకొని పొరపాటున సాండర్స్ అనే అధికారిని కాల్చారు. ఇదేకాలంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు పార్లమెంటు పై దాడి చేయడము, వారిని పోలీసులు పట్టుకోవడము, న్యాయస్థానంలో వారి ఉరి శిక్ష పడడము జరిగి పోయాయి. పిబ్రవరి 27, 1931 తెల్లవారుజామున జవహర్ లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు ఆజాద్. కాని నెహ్రూ అజాద్ కు ఏ సమాదానము చెప్పలేదు.
భగత్‌సింగ్‌ను ఎలాగైనా విడుదల చేయించాలనే ప్రణాళికలో భాగంగా ఫిబ్రవరి 27, 1931న చర్చలు జరుపుతుండగా అందులో రహస్య పోలీసులున్నట్లుగా అనుమానం వచ్చి ముగ్గురిని హతమార్చాడు. చివరికి తన తుపాకీలో ఒకే గుండు ఉందని తెలుసుకొని తాను పట్టుపడటం ఖాయం అనీ భావించి అరెస్ట్ కావడం కంటే చనిపోవడమే మేలని తనకుతాను కాల్చుకొని అమరుడయ్యాడు.
గుర్తింపులు:
ఇవి కూడా చూడండి:
= = = = =
|
17, జులై 2019, బుధవారం
చంద్రశేఖర్ ఆజాద్ (Chandra Shekhar Azad)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి