వాంకిడి కొమురంభీం జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలం జిల్లాలో ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దులో 19° 32' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 21' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది.. తెలంగాణ విమోచనకారుడు, ఉద్యమనేత, డిప్యూటి స్పీకరుగా పనిచేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ, మాజీ మంత్రి కొట్నాక భీంరావు ఈ మండలానికి చెందినవారు. చికిలి వాగు నది ఒడ్డున చాళుక్య-పల్లవ కాలం నాటి శిల్పసంపదతో కూడిన శ్రీ శివకేశ్వర దుర్గాలయం ఉంది. ఈ మండలము ఉట్నూరు రెవెన్యూ డివిజన్, ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 29 గ్రామపంచాయతీలు, 37 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన కొమరంభీం ఆసిఫాబాదు జిల్లాలో చేరింది. . భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున కాగజ్‌నగర్ మండలం, దక్షిణాన ఆసిఫాబాదు మండలం, పశ్చిమాన కెరామెరి మండలం, ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 29388. ఇందులో పురుషులు 14938, మహిళలు 14450. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 35583. ఇందులో పురుషులు 17905, మహిళలు 17678. రవాణా సౌకర్యాలు: రాజకీయాలు: ఈ మండలము ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. డిప్యూటి స్పీకరుగా పనిచేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ, మాజీ మంత్రి కొట్నాక భీంరావు ఈ మండలానికి చెందినవారు.
వాంకిడి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akini, Arli, Bambara, Bendara, Boarda, Boranjiguda (UI), Chichpally, Chincholi, Choupanguda, Devudpally (UI), Dhaba, Ghatjangaon, Goegaon, Gunjada, Indhani, Jaithpur, Jambuldhari, Kannergaon, Khamana, Khedegaon, Khirdi, Komatiguda, Lanjanveera, Mahagaon, Narlapur, Navegaon, Neemgaon, Nukewada (UI), Samela, Sarandi, Sarkepally, Sawathi, Sonapur, Tejapur, Velgi, Wankidi (Kalan), Wankidi (Khurdu)
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బంబార (Bambara): బంబార కొమురం భీం జిల్లా వాంకిడి మండలమునకు చెందిన గ్రామము. 1962, 67, 72లలో ఆసిఫాబాదు నుంచి విజయం సాధించిన కొట్నాక భీంరావు స్వగ్రామం. పీవి. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. కొట్నాక భీంరావు కూతురు కోవలక్ష్మి 2014లో ఆసిఫాబాదు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించగా, 2019లో జైనూర్ జడ్పీటీసిగా విజయం సాధించి జడ్పీ చైర్మెన్ అయ్యారు.
వాంకిడి (Vankidi / Wankidi):
వాంకిడి కొమురం భీం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. తెలంగాణ ప్రముఖుడూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Wankidi Mandal, Komarambheem Dist (district) Mandal in telugu, Komuram bheem kumram bheem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి