భీమిని మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. 19° 10' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 38' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్న ఈ మండలం మంచిర్యాల జిల్లాలో ఉత్తరాన కొమరంభీం జిల్లా సరిహద్దులో ఉంది. భీమిని మండలంలోని నల్లవాగుపై పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్తు నిర్మిస్తున్నారు. ఇది ఆసిఫాబాదు రెవెన్యూ డీవిజన్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 4 ఎంపీటీసి స్థానాలు, 12 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వూవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో భాగంగా మారింది. అదేసమయంలో దహేగాం మండలంనుంచి 5 గ్రామాలను ఈ మండలంలో కలుపగా, ఈ మండలంలోని 19 గ్రామాలు కొత్తగా ఏర్పడిన కన్నేపల్లి మండలంలో విలీనం చేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణాన కన్నేపల్లి మండలం, నైరుతిన తాండూరు మండలం, మిగితా అన్నివైపులా కొమరంభీం జిల్లా సరిహద్దుగా ఉంది. రాజకీయాలు: ఈ మండలము బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009కి పూర్వం ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది. రవాణా సౌకర్యాలు: ఈ మండలానికి రైలు రవాణా మరియు జాతీయ రహదారి సౌకర్యం లేదు. బెల్లంపల్లి, తాండూరు, రెబ్బెనలు సమీప రైల్వేస్టేషన్లు. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 23687. ఇందులో పురుషులు 12119, మహిళలు 11568. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 26291. ఇందులో పురుషులు 13237, మహిళలు 13054. అక్షరాస్యత శాతం 45.91%.
భీమిని మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akkalapalle, Bhimini, Bitturpalle, Chinna Gudipet, Chinnathimmapur, Dampur, Kamalapur (D), Karjibheempur, Keslapur, Laxmipur, Mallidi, Pedda Thimmapur, Peddagudipet, Peddapeta, Pothepalli (D), Rajaram, Ramaraopet (D), Thangallapalli, Veegaon, Venkatapur, Wadal
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bhimini Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి