నెన్నెల (నెన్నెల్) మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. 18° 59' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 37' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్న ఈ మండలము మంచిర్యాల రెవెన్యూ డివిజన్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలం గుండా గొల్లవాగు ప్రవహిస్తోంది. మలిదశ తెలంగాణ ఉద్యమం సమయంలో ఐకాస చైర్మెన్‌గా వ్యవహరించిన కోదండరాం ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు, 19 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వూవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో భాగంగా మారింది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లా మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన కన్నేపల్లి మండలం , తూర్పున వేమనపల్లి మండలం, కోటపల్లి మండలం, దక్షిణాన చెన్నూరు మండలం, భీమారం మండలం, పశ్చిమాన బెల్లంపల్లి మండలం, నైరుతిన మందమర్రి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. రవాణా సౌకర్యాలు: ఈ మండలానికి జాతీయ రహదారి మరియు రైలు సౌకర్యం లేదు. పశ్చిమ సరిహద్దుగా ఉన్న బెల్లంపల్లి, మందమర్రి మండలాల గుండా రైల్వేలైన్ వెళ్ళుచున్నది. దక్షిణ సరిహద్దుగా ఉన్న జైపూర్, చెన్నూర్ మండలాల నుంచి జాతీయ రహదారి వెళ్ళుచున్నది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 21389. ఇందులో పురుషులు 10756, మహిళలు 10633. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 23441. ఇందులో పురుషులు 11764, మహిళలు 11677. అక్షరాస్యత శాతం 43.89%.
నెన్నెల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Avadam, Chinavenkatapur, Chittapur, Dammireddipet, Ghanpur, Gollapalle, Gudipet, Gundlasomaram, Jangalpet, Jhandavenkatapur, Jogapur, Kharji, Konampet, Kothur, Kushenapalle, Mailaram, Manneguda, Metpalle, Nandulapalle, Nennal, Pottiyal
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
జోగాపూర్ (Jogapur): జోగాపూర్ మంచిర్యాల జిల్లా నెన్నెల మండలమునకు చెందిన గ్రామము. మలిదశ తెలంగాణ ఉద్యమం సమయంలో ఐకాస చైర్మెన్‌గా వ్యవహరించిన కోదండరాం ఈ గ్రామమునకు చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Nennel Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి