దండేపల్లి మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 18° 58' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 10' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలానికి దక్షిణాన గోదావరి నది, దానికి ఆవల కరీంనగర్ జిల్లా సరిహద్దుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన జె.వి.నర్సింగరావు, రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన జె.వి.సుధాకర్ రావు, ఎమ్మెల్యేగా పనిచేసిన అజ్మీరాగోవిందనాయక్, చుంచులక్ష్మయ్య, ఊరుమనదిరా వాడ మనదిరా పాత రచయిత గూడ అంజయ్య ఈ మండలమునకు చెందినవారు. గూడెంలో గుట్టపై వెలిసిన శ్రీసత్యనారాయణస్వామి ఆలయం ప్రసిద్ధి చెందినది. ఈ మండలము మంచిర్యాల రెవెన్యూ డివిజన్, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 31 గ్రామపంచాయతీలు, 30 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున కాసిపేట మండలం, ఆగ్నేయాన లక్సెట్టిపేట మండలం, వాయువ్యాన జన్నారం మండలం, ఉత్తరాన కొమరంబీం జిల్లా, దక్షిణాన మరియు పశ్చిమాన జగిత్యాల జిల్లా సరిహద్దుగా ఉంది. రాజకీయాలు: ఈ మండలము మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009కి పూర్వం ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 46824. ఇందులో పురుషులు 23414, మహిళలు 23400. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49526. ఇందులో పురుషులు 24629, మహిళలు 24897.
దండేపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Allipur, Andugulpet, Bikkanguda, Chintapalle, Dandepalle, Dharmaraopet, Dwaraka, Gudam, Gurrevu, Jaidapet, Kamepalle, Karvichelma, Kasipet, Kondapur, Kundelapahad, Laxmikantapur, Lingapur, Makulpet, Mamidipalle, Medaripet, Mutyampet, Nagasamudram, Nambal, Narsapur, Peddapet, Rebbenpalle, Tallapet, Tanimadugu, Velganoor, Venkatapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ధర్మారావుపేట (Dharmaraopet): ధర్మారావుపేట మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన జె.వి.నర్సింగరావు ఈ గ్రామానికి చెందినవారు. గూడెం (Gudem): గూడెం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలమునకు చెందిన గ్రామము. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గుట్టపై అయ్యప్పస్వామి ఆలయం ఉంది. మరో గుట్టపై శ్రీసత్యనారాయణస్వామి ఆలయం నిర్మించబడింది. ఇక్కడ ఎత్తిపోతల పథకాన్నినిర్మిస్తున్నారు. 2009లో పనులు ప్రారంభించారు. గ్రామంలో హనుమాన్ మందిరం కూడా ఉంది. కన్నెపల్లి (Kannepally): కన్నెపల్లి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలమునకు చెందిన గ్రామము. లక్సెట్టిపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన చుంచులక్ష్మయ్య ఈ గ్రామానికి చెందినవారు. లింగాపూర్ (Lingapur): లింగాపూర్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలమునకు చెందిన గ్రామము. 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందిన అజ్మీరా గోవిందనాయక్ ఈ గ్రామానికి చెందినవారు. ఊరుమనదిరా వాడ మనదిరా పాట రచయిత గూడ అంజయ్య కూడా ఈ గ్రామానికే చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Dandepalli or Dandepally Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి