హాజీపూర్ మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం జిల్లాలో దక్షిణ భాగంలో గోదావరి నది తీరాన ఉన్నది. ఇది మంచిర్యాల రెవెన్యూ డివిజన్, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది. మండలంలోని నస్పూర్, తాళ్ళపల్లి, తీగల్ పహాడ్ లలో సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. మండల పరిధిలోని ముల్కలపల్లి వద్ద ర్యాలివాగు ప్రాజెక్టు ఉంది. 2020 మార్చిలో మండల పరిధిలోని పాత చిత్తారయ్య గుహల్లో మధ్యయుగం కాలం నాటి రాతిశిల్పాలు బయటపడ్డాయి.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం ఈ మండలంలోని గ్రామాలు మంచిర్యాల మండలంలో, ఆదిలాబాదు జిల్లాలో భాగంగా ఉండేవి. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన కాసిపేట మండలం, తూర్పున మందమర్రి మండలం మరియు మంచిర్యాల మండలం, పశ్చిమాన లక్సెట్టిపేట మండలం, దక్షిణాన జగిత్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: మంచిర్యాల మొదట లక్సెట్టిపల్లి తాలుకాలో ఉండేది. ఆ తర్వాత పంచాయతి సమితిగా ఏర్పడి జిల్లాలోనే అగ్రగామి పట్టణంగా రూపొందింది. 1947-48లలో నిజాం వ్యతిరేక ఉద్యమంలో మండలానికి చెందిన పలువులు ఉద్యమకారులు పాల్గొన్నారు. కె.వి.రమణయ్య, అర్జున్ రావు, పి.నర్సయ్య పటేల్, కోలేటి వెంకటయ్య, చందూరి రాజయ్యలు వీరిలో ప్రముఖులు. 1948లో భారత యూనియన్‌లో విలీనమై హైదరాబాదు రాష్ట్రంలో, 1956-2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగి 2014 నుంచి తెలంగాణలో భాగంగా ఉంది. 2016 అక్టోబరు 11కు ముందు ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. రాజకీయాలు: ఈ మండలము మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009కి పూర్వం ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది. జనాభా:
హాజీపూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Chandanapur, Donabanda, Gadhpur, Gudipet, Hajipur, Hussainsagar, Karnamamidi, Kondapur, Kondepally, Kothapally, Mulkalla, Nagaram, Namnur, Narsingapur, Padthenpally, Peddampet, Pochampahad, Rapalle, Ryali, Subbapally, Vempally
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గఢ్ పూర్ (Gadhpur): గఢ్ పూర్ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం నాపరాళ్ళకు ప్రసిద్ధి. సున్నపురాయి నిక్షేపాలు కూడా ఉన్నాయి. సమీపంలో సిమెంటు, సిరామిక్స్ పరిశ్రమల వల్ల గ్రామం అభివృద్ధి చెందింది. ఏసీసీ సిమెంటు పరిశ్రమ గుట్టలపైకి రోప్ వే ఏర్పాటుచేసింది (ముడిపదార్థాలు తీసుకుపోవడానికి). ఒక పరిశ్రమ ఇలా చేయడం రాష్ట్రంలోనే తొలిసారి. గుడిపేట (Gudipet): గుడిపేట మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలమునకు చెందిన గ్రామము. గుడిపేటలో తెలంగాణ స్పెషల్ పోలీస్ 13వ పటాలం ఉంది. హాజీపూర్ (Hajipur): హాజీపూర్ మంచిర్యాల జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. అక్టోబరు 11, 2016న కొత్తగా ఇది మండల కేంద్రంగా మారింది. అంతకు క్రితం మంచిర్యాల మండలంలో భాగంగా ఉండేది. లక్సెట్టిపల్లి నుంచి 1983లో విజయం సాధించిన మురళీమనోహర్ రావు ఈ గ్రామానికి చెందినవారు. ఇతను గ్రామపంచాయతి సర్పంచిగా, సమితి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇతని కుమారుడు వినయ్ ప్రకాశ్ రావు జడ్పీటీసి సభ్యునిగా పనిచేయగా, వినయ్ భార్య హరిప్రియ ఎంపీపీగా పనిచేసింది. ముల్కాల (Mulkala): ముల్కాల మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలమునకు చెందిన గ్రామము. 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఇక్కడ పుష్కరఘాట్ ఏర్పాటుచేశారు. ముల్కలపల్లి (Mulkalapally): ముల్కలపల్లి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలమునకు చెందిన గ్రామము. ముల్కలపల్లి పరిధిలో ర్యాలివాగు ప్రాజెక్టు నిర్మించబడింది. 2005లో నిర్మాణం ప్రారంభించగా, 2009లో ప్రాజెక్తు పూర్తయింది. 24-08-2009న ముఖ్యమంత్రిచే ప్రారంభించబడింది.. ప్రాజెక్టు కింద 6వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Hajipur Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి