జైపూర్ మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 18° 46' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 36' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 20 గ్రామపంచాయతీలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలము దక్షిణ సరిహద్దులో గోదావరి నది ప్రవహిస్తుంది. ఇందారం, భీమారంలు మండలంలోని పెద్ద గ్రామాలు. మండలం గుండా నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది. జైపూర్ మండలం చెన్నూరు వద్ద సింగరేణి కాలరీస్ లిమిటెడ్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. శివ్వారం గ్రామంలో ఎల్ మడుగు మొసళ్ల అభయారణ్యంగా ప్రభుత్వం గుర్తించింది.
అక్టోబరు 11, 2016కు ముందు ఆదిలాబాదు జిల్లాలో ఉన్న ఈ మండలం జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో భాగమైంది. అదేసమయంలో జైపూర్ మండలంలోని 12 గ్రామాలను విడదీసి కొత్తగా భీమారం మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున భీమారం మండలం, ఈశాన్యాన చెన్నూరు మండలం, ఉత్తరాన మందమర్రి మండలం, పశ్చిమాన నస్పూర్ మండలం, దక్షిణాన పెద్దపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. రాజకీయాలు:
ఈ మండలము చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009కి పూర్వం ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 46786. ఇందులో పురుషులు 23800, మహిళలు 22986. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49375. ఇందులో పురుషులు 24779, మహిళలు 24596. కాలరేఖ:
జైపూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bejjal, Gangipalle, Gopalpur, Indaram, Jaipur, Kachanpelly (D), Kankur, Kistapur, Kundaram, Maddikunta, Maddulapalle, Mittapalle, Narasingapuram, Narva, Pegadapalle, Pownur, Ramaraopet, Rommipur, Shetpalle, Shivvaram, Tekumatla, Velal, Yelkanti
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
పెగడపల్లి (Pegadapalli): పెగడపల్లి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామసమీపంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నారు.
శివ్వారం (Shivvaram):
శివ్వారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో ఎల్ మడుగు మొసళ్ళ అభయారణ్యంను రాష్ట్ర ప్రభుత్వం 1978లో గుర్తిస్తూ ఉత్తర్వు జారీ చేసింది.
సుద్దాల (Suddala):
సుద్దాల మంచిర్యాల జిల్లా జైపూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడి రామాలయం ప్రసిద్ధమైనది.
వేలాల (Velala):
వేలాల మంచిర్యాల జిల్లా జైపూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది మండల కేంద్రానికి 18 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ మల్లికార్జునస్వామి ఆలయం ఉంది. 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఇక్కడ ఘాట్‌ను ఏర్పాటుచేశారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Jaipur Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి