కాసిపేట మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 19° 03' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 19' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. బొగ్గు నిక్షేపాలు కల్గిన ఈ మండలం ఇది సింగరేణి పరిధిలోకి వస్తుంది. దేవాపూర్‌లో ఓరియంట్ సిమెంటు కర్మాగారం ఉంది. మల్కేపల్లి గ్రామశివారులో రాళ్ళవాగు ప్రాజెక్టు నిర్మించారు. ఈ మండలము బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వూవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో భాగంగా మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున బెల్లంపల్లి మండలం, దక్షిణాన మందమర్రి మండలం, హాజీపూర్ మండలం, లక్సెట్టిపేట మండలం, పశ్చిమాన దండేపల్లి మండలం, ఉత్తరాన కొమురంభీం మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: ఈ మండలానికి రైలుసదుపాయము కాని జాతీయ రహదారి సౌకర్యం కాని లేదు. తూర్పు వైపున సమీపం నుంచి మందమర్రి, బెల్లంపల్లి, తాండూరు మండలాల మీదుగా రైల్వేలైన్ వెళ్ళుచున్నది. దక్షిణాన ఉన్న మంచిర్యాల మీదుగా జాతీయ రహదారి పోవుచున్నది. తాండూరు, బెల్లంపల్లిల నుంచి రోడ్డు సదుపాయం ఉంది. రాజకీయాలు: ఈ మండలము బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 32016. ఇందులో పురుషులు 16378, మహిళలు 15938. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 32807. ఇందులో పురుషులు 16432, మహిళలు 16345. పట్టణ జనాభా 16745 కాగా గ్రామీణ జనాభా 16062.
కాసిపేట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Chintaguda, Dharmaraopet, Gatrapalle, Gurvapur, Kankalapur, Kasipet, Kometichenu, Kondapur, Konur, Kurreghad, Malkepalle, Muthempalle, Pallamguda, Peddampalle (R), Peddapur, Rottepalle, Sonapur, Tirmalapur, Varipet, Venkatapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
దేవాపుర్ (Devapur): దేవాపూర్ మంచిర్యాల జిల్లా కాసిపేట మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ ఓరియంట్ సిమెంటు కర్మాగారం ఉంది. మండలంలో ఇదే అత్యధిక జనాభా కల గ్రామము. మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వెళ్ళు రహదారికి ఎడమ వైపున కాసిపేట దాటిన పిదప దేవాపూర్ ఉంది. దేవాపూర్ లో ప్రభుత్వ ఆశ్రమ ఉనత పాఠశాల, జల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల, సిజిసి ఉన్నత పాఠశాల ఉన్నాయి. కాసిపేట (Kasipet): కాసిపేట మంచిర్యాల జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. దేవాపూర్ తర్వాత మండలంలో ఇది రెండవ అత్యధిక జనాభా కల గ్రామము. మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వెళ్ళు రహదారికి ఎడమ వైపున దేవాపూర్ మార్గాన కాసిపేట ఉంది. మల్కేపల్లి (Malkepally): మల్కేపల్లి మంచిర్యాల జిల్లా కాసిపేట మండలమునకు చెందిన గ్రామము. రామశివారులో రాళ్లవాగుపై 2002లో రాళ్ళవాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 10 గ్రామాల పరిధిలో 3500 ఎకరాలకు సాగు నీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మల్కేపల్లిలలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ఉన్నది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kasipet Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి