కోటపల్లి మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. జిల్లాలో తూర్పువైపున మహరాష్ట్ర సరిహద్దున ఉన్న ఈ మండలం తూర్పు సరిహద్దుగా ప్రాణహిత నది ప్రవహిస్తోంది. మండలంలోని వెంచపల్లి, సూపాక, జనగాం, శివరాంపల్లి, ఆల్గాం, పుల్లాగాం, అన్నరాం, అర్జునగుట్ట గ్రామాలు ప్రాణహిత నది ఒడ్డున ఉన్నాయి. ఈ మండలము 18° 55' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 49' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. ఎమ్మెల్సీగా, జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన సుల్తాన్ అహ్మద్ ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 31 గ్రామపంచాయతీలు, 34 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం దక్షిణ భాగం గుండా నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వూవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో భాగంగా మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన వేమనపల్లి మండలం, దక్షిణాన చెన్నూరు మండలం, పశ్చిమాన నెన్నెల్ మండలం, తూర్పున మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: ఈ మండలానికి రైలుసదుపాయము లేదు. 16వ నెంబరు జాతీయ రహదారి మండలంలో దక్షిణ భాగం నుమ్చి వెళ్ళుచున్నది. మండల కేంద్రం నుంచి దక్షిణన జాతీయ రహదారిపై ఉన్నచెన్నూరుకు, ఉత్తరాన వేమనపల్లికి రోడ్డుమార్గం ఉంది. రాజకీయాలు: ఈ మండలము చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 30605. ఇందులో పురుషులు 15253, మహిళలు 15352. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 33142. ఇందులో పురుషులు 16444, మహిళలు 16698.
కోటపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Algaon, Annaram, Arjungutta, Bopparam, Borampalle, Brahmanpalle, Dewalwada, Edagatta, Edula Bandam, Jangaon, Kawarkothapalle, Kollur, Kondampet, Kotapalle, Lingannapet, Mallampet, Nagampet, Nakkalpalle, Pangadisomaram, Parpalle, Pinnaram, Pullagaon, Rajaram, Rampur, Rapanpalle, Rawalpalle, Sarvaipet, Shankarpur, Shetpalle, Sirsa, Supak, Venchapalle, Vesonvai, Yerraipet
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అలగాన (Algaon): అలగాన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఎమ్మెల్సీగానూ, కో-ఆప్షన్ సభ్యుడుగానూ ఎన్నికై జడ్పీ వైస్-చైర్మెన్‌గా, ఒక ఏదాడి జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన మహ్మద్ సుల్తాన్ ఈ గ్రామానికి చెందినవారు.
అర్జునగుట్ట (Arjunagutta):
అర్జునగుట్ట మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇది ప్రాణహిత నది ఒడ్డున ఉంది. 2010 డిసెంబరు 6-13 వరకు జరిగిన ప్రాణహిత నది పుష్కరాల సందర్భంగా అర్జునగుట్ట వద్ద పుష్కరఘాట్ ఏర్పాటుచేశారు. డిసెంబరు 6, 2010న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నది పుష్కరాలను ప్రారంభించారు.
దేవులవాడ (Devulavada):
దేవులవాడ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇది ప్రాణహిత నది ఒడ్డున ఉంది. ఈ గ్రామానికి ప్రాణహిత నది ఆవల కాళేశ్వరం క్షేత్రం ఉంది.
సిర్సా (Sirsa):
సిర్సా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇది ప్రాణహిత నది ఒడ్డున ఉంది. ఈ గ్రామం సమీపంలో ప్రాణహితనదిపై ఎత్తిపోతన పథకం నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kotapally or Kotapalli Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి