కన్నేపల్లి మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 19° 10' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 38' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. భీమిని మండలంలోని నల్లవాగుపై పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్తు నిర్మిస్తున్నారు. 5 ఎంపీటీసి స్థానాలు, 15 గ్రామపంచాయతీలు, 24 రెవెన్యూ గ్రామాలు కల్గిన ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజన్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు భీమిని మండలంలో ఉన్న 19 రెవెన్యూ గ్రామాలు, దహేగాం మండలంలోని 2 గ్రామాలు, వేమనపల్లి మండలంలోని 3 గ్రామాలతో కలిపి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున వేమనపల్లి మండలం, దక్షిణాన నెన్నెల్ మండలం, ఉత్తరాన భీమిని మండలం, పశ్చిమాన తాండూరు మండలం మరియు బెల్లంపల్లి మండలం, ఈశాన్యాన కొమరంభీం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.
కన్నేపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ankannapet (D), Babapur, Chinthapudi, Dampur, Gollaghat, Jajjarvelly, Jankapur, Kannepalle, Kothapalle, Lingala, Lingapur, Madavelli, Metpalle, Mothkupalli (D), Muthapur, Nagapelli, Polampalle, Rebbena, Salegaon, Shiknam, Surjapur, Tekulapalle, Veerapur, Yellaram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kannepalli Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి