కరోనా వైరస్ వల్ల వ్యాపించే 2019 సం.పు కరోనా వ్యాధికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19గా పేరుపెట్టింది. ఈ వ్యాధి తొలిసారిగా చైనాలోని ఊహాన్ నగరంలో డిసెంబరు 31న వెలుగులోకి వచ్చింది. క్రమక్రమంగా విజృంభించి ఒక్క చైనా 80వేలకు పైగా వ్యక్తులకు సోకగా 3వేలకు పైగా వ్యాధిగ్రస్థులు మరణించారు. చైనా తర్వాత ఇరాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, అమెరికా దేశాలలో వ్యాధి ప్రబలంగా వ్యాపించింది. ఈ వ్యాధి ఎలా వ్యాపించింది అనే దానికి ఖచ్చితమైన ఆధారం లభించలేదు కాని గబ్బిలాల నుంచి సోనినట్లుగా శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. క్షయ వ్యాధి లక్షణాలతో పోలిక ఉన్న ఈ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశానికి సంబంధించినది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, చిన్నపల్లు, వృద్ధులు, ఇతర సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధి ప్రాణాంతకం కావచ్చు.
దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ వ్యాధి వ్యాపించి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2020 ఏప్రిల్ మొదటివారంలో అమెరికా జనజీవతాన్ని, ఆర్థికవ్యవస్థకు దెబ్బతీసింది. ఏప్రిల్ 5 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.6 లక్షల మందికి వ్యాధి సోకగా 68వేలకు పైగా మరణించారు. వ్యాధి సోకివ వారి సంఖ్యలో అమెరికా 3 లక్షలతో అగ్రస్థానంలో ఉండగా, స్పెయిన్, ఇటలీలు కూడా లక్షకుపైగా పాజిటివ్ కేసులతో రెండో, మూడో స్థానాలలో ఉన్నాయి. (తాజా వివరాలకై ఇక్కడ చూడండి). భారతదేశంలో కరోనా వ్యాప్తి: భారతదేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు జనవరి 30, 2020న కేరళలో నమోదైంది. ఆ తర్వాత మరో రెండు కేసులు కూడా కేరళలోనే గుర్తించబడ్డాయి. ఆ తర్వాత రాజస్థాన్‌లో ఇటలీ పౌరులకు కరోనా సోకినట్లు నిర్థారించబడింది. మారి 7 నాటికి స్థానికులు మరియు విదేశీయులకు కల్పి 32 మందికి వ్యాధి ఉన్నట్లుగా గుర్తించబడింది. విదేశాల నుంచి వస్తున్నవారి వల్ల స్థానికులకు వ్యాధి సోకడాన్ని నిరోధించడానికై మార్చి 22న అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేశారు. మార్చి 22న ప్రధానమంత్రి నరేంద్రమోడి జనతాకర్ఫ్యూ పాటించాలని సూచించారు. దీనితో దేశవ్యాప్తంగా ఆదివారం నాడు ప్రజలందరూ ఇళ్ళకే పరిమితమైనారు. అదేరోజు సాయంత్రం మార్చి 23 నుంచి అన్ని రవాణా సంస్థలు, వ్యాపారసంస్థలు, పైవేటు కార్యాలయాలు, దేవాలయాలు, హాస్టళ్ళు, సినిమాహాళ్ళు మూసివేయాలనీ లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ లాక్‌డౌన్ 21 రోజులపాటు ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. నిత్యావరసర సరకులు అమ్మే దుకాణాలు, పాలు, పండ్లు, కూరగాయల అమ్మకాలకు మాత్రం ఉద్యమం వేళలో అనుమతి ఇవ్వబడింది.
నిజాముద్దీన్ మర్కజ్ పరిణామాలు: ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌కు దేశవిదేశాల నుంచి సుమారు 2000 మంది హాజరైనట్లుగా కేంద్ర హోంశాఖ నిర్థారించింది. హాజరైన వారిలో పలువురికి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నందున దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతం నుంచి దీనికి హాజరైన వారివల్ల ఈ వ్యాధి పలు ప్రాంతాలకు వ్యాపించినట్లుగా కేంద్రం అంచనా వేస్తోంది. లాక్‌డౌన్ సమయంలో కూడా వేలమంది గుమిగూడి సమావేశం నిర్వహంచడంపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. కరీంనగర్‌లో 10 మంది ఇండోనేషియన్లకు కరోనా సోకినట్లు గుర్తించగానే మార్చి 21 నాడు కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఈ విధయంపై సమాచారం ఇచ్చింది. అప్పటి నుంచి ఈ సమావేశానికి హాజరైన వారికి పరీక్ష చేసి క్వారంటైన్‌లో ఉంచడం మరియు సోకినవారికి ఆసుపత్రిలకు తరలించడం చేయడం జరిగింది. ఈ సభలకు హాజరైన ప్రతివ్యక్తి తప్పనిసరిగా వ్యాధి పరీక్ష చేయించుకోవాలని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కోరడమే కాకుండా ఆయా చిరునామాలపై పోలీసు బలగాలు కూడా ఇంటింటికీ తిరిగి పరీక్ష చేయిస్తున్నాయి. అయిననూ ఇంకనూ సుమారు 200పైగా వ్యక్తుల ఆచూకీ లభ్యంకాలేదు. సగం జీతాలు: దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం భవిస్యత్తు ఆర్థిక పరిస్థితిని ఊహించి ప్రభుత్వోద్యోగులకు పూర్తి వేతనం కాకుండా మార్చి నెలకు సంబంధించి 50% జీతం మాత్రమే చెల్లించింది. ఆలిండియా సర్వీస్ ఉద్యోగులకు 60%, నాల్గవ తరగతి ఉద్యోగులకు 10% మాత్రమే నిల్పుదల ఉంటుందని ప్రకటించింది. పదవీవిరమణ చెందిన వారికి చెల్లించే పెన్షన్లలో కూడా ఇదేరకమైన కోత ఉంటుందని ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 23లో పేర్కొనబడింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీతం రెండు విడతలుగా చెల్లించబడుతుందని ప్రకటించింది. కాలరేఖ:
ఇవి కూడా చూడండి:
|
4, ఏప్రిల్ 2020, శనివారం
కరోనా వ్యాధి వ్యాప్తి (coronavirus pandemic)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి