తెలంగాణ రాబిన్‌హుడ్‌గా, బహుజన వర్గాల ఆరాధ్యుడిగా ప్రసిద్ధి చెందిన పండగ సాయన్న మహబూబ్‌నగర్ ప్రాంతానికి చెందినవాడు. బందిపోటుగా ముద్రపడిన పండగ సాయన్న ఉన్నవారి నుంచి దోచుకొని పేదవారికి పంచిపెట్టేవాడు. క్రీ.శ. 19వ శతాబ్దికి చెందిన ఈయన మహబూబ్‌నగర్, నవాబ్‌పేట, కుల్కచర్ల ప్రాంతాలలో చేసిన మంచిపనులు జానపదాల రూపంలో ఇప్పటికీ పేదప్రజలు స్మరించుకుంటున్నారు.
పండగ సాయన్న జీవిత విశేషాలపై స్పష్టమైన వివరాలు లేవు. 2017లో పాలమూరుకు చెందిన న్యాయవాది బెక్కరి జనార్థన్ పలు విషయాలు సేకరించి పుస్తకం ప్రచురించారు. పండగ సాయన్న హత్య కూడా ఒక మిస్టరీగా మిగిలింది. దీన్ని కథలుకథలుగా చెప్పుకుంటారు. వనపర్తి సంస్థాన రాణి శంకరమ్మ ఈయనను కాపాడడానికి ప్రయత్నించిననూ నిజాం అనుచరులచే హత్యకు గురైనట్లుగా కథనం వ్యాప్తిలో ఉంది. మహబూబ్‌నగర్ పట్టణంలో ఈయన పేదలకు చేసిన సేవలకు గుర్తుగా తిరుమలదేవుని గుట్ట రైల్వే గేట్ కూడలికి పండగసాయన్న అడ్డాగా పేరుపెట్టబడింది. ఈయన విగ్రహాన్ని కూడా పట్టణంలో స్థాపించాలని శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. 2020లో పండగ సాయన్న జీవితంపై ఏ.ఎం.రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో పండుగ సాయన్న పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
4, ఏప్రిల్ 2020, శనివారం
పండగ సాయన్న (Pandaga Sayanna)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి