బీర్పూర్ జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 15 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు. పెంబట్ల-కోంపూర్ లో శ్రీదుబ్బ రాజేశ్వరస్వామి దేవాలయం ఉంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం సారంగాపూర్ మండలంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఊండేది. సారంగాపూర్ మండలాన్ని రెండుగా విభజించి 11 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో ఉత్తరాన నిర్మల్ మరియు మంచిర్యాల జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున ధర్మపురి మండలం, దక్షిణాన సారంగాపూర్ మండలం, పశ్చిమాన రాయికల్ మండలం, ఉత్తరాన నిర్మల్ మరియు మంచిర్యాల జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. రవాణా సౌకర్యాలు: నిజామాబాదు-జగదల్ పూర్ జాతీయ రహదారి ఈ మండలానికి దక్షిణంగా కోరుట్ల, మేడిపల్లిల మీదుగా పోవుచున్నది. రాజకీయాలు: ఈ మండలము జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 45131. ఇందులో పురుషులు 21994, మహిళలు 23137.
బీర్పూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Beerpur, Cherlapalli, Kammunur, Kandlapalli, Kolvai, Mangela, Narsimlapalli, Rangasagar, Rekulapalli, Thalla Dharmaram, Thungur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Beerpur Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి