ఎలిగేడ్ పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 12 గ్రామపంచాయతీలు, 9 రెవెన్యూ గ్రామాలు కలవు. చారిత్రాత్మకమైన ధూళికట్ట బౌద్ధస్థూపం ఈ మండలంలోనే ఉంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో పశ్చిమాన కరీంనగర్ జిల్లా సరిహద్దులో ఉంది. తూర్పున మరియు దక్షిణాన సుల్తానాబాద్ మండలం, ఉత్తరాన జూలపల్లి మండలం, ఈశాన్యాన పెద్దపల్లి మండలం, పశ్చిమాన కరీంనగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన తానిపర్తి శ్రవంతి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన ఎం.రేణుక ఎన్నికయ్యారు. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 22344. ఇందులో పురుషులు 11107, మహిళలు 11237. అక్షరాస్యుల సంఖ్య 12505. కాలరేఖ:
ఎలిగేడ్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Burhanmiyapet, Doolikatta, Elgaid, Lokapeta, Muppirithota, Narsapur, Ryakaldevpalli, Sivapalli, Sultanpur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ధూళికట్ట (Dhoolikatta): ధూళికట్ట పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ మండలమునకు చెందిన గ్రామము. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రాచీన మరియు చారిత్రకమైన ప్రాంతాలలో ఒకటి. అతిప్రాచీన బౌద్ధస్తూపంగా పేర్కొనబడే ధూళికట్ట బౌద్ధస్తూపం ఈ గ్రామంలోనే బయటపడింది. ఇది హుసేనిమియా వాగు తీరాన ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Manthani Mandal in Telugu, Peddapalli Dist (district) Mandals in telugu, Peddapalle Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి