కమాన్‌పూర్ పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు, 9 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు. తెలంగాణలోని ప్రముఖ దుర్గాలలో ఒకటైన రామగిరి ఖిల్లా ఈ మండలంలో ఉంది. ఈ మండలము మంథని అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో భాగమైంది. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలాన్ని విభజించి మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలను కొత్తగా ఏర్పాటైన రామగిరి మండలంలో కలిపారు. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన పాలకుర్తి మరియు రామగుండం మండలాలు, తూర్పున మరియు ఆగ్నేయాన రామగిరి మండలం, దక్షిణాన శ్రీరాంపూర్ మండలం, పశ్చిమాన పెద్దపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: పెద్దపల్లి నుంచి మంథని వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము మంథని అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన రాచకొండ లక్ష్మి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన పుట్టా మధుకర్ ఎన్నికయ్యారు. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 75023. ఇందులో పురుషులు 37870, మహిళలు 37153.
కమాన్‌పూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Gundaram, Jalipalli, Julapalli, Kamanpur, Lingala, Mulkalapalli, Nagaram, Penchikalpet, Perapalli, Rajapur, Rompikunta
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kamanpur Mandal in Telugu, Peddapalli Dist (district) Mandals in telugu, Peddapalle Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి