ఓదెల పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలము. మండల కేంద్రం సమీపంలో ఓదెల మల్లన్నగా ఖ్యాతిగాంచిన మల్లిఖార్జున స్వామి దేవస్థానం కలదు. కాజీపేట బల్హార్షా రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది. ఓదెల, కలనూరులలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన చింతకుంట విజయరమణారావు ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం దక్షిణ సరిహద్దు గుండా మానేరు నది ప్రవహిస్తోంది. మండలకేంద్రం ఓదెలలో రైల్వేస్టేషన్ ఉంది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన పెద్దపల్లి మండలం, ఈశాన్యాన మరియు తూర్పున శ్రీరాంపూర్ మండలం, దక్షిణాన కరీంనగర్ జిల్లా, పశ్చిమాన సుల్తానాబాదు మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా మానేరు నది ప్రవహిస్తోంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42113. ఇందులో పురుషులు 20968, మహిళలు 21145. రాజకీయాలు: ఈ మండలము పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన కూనారపు రేణుకాదేవి, జడ్పీటీసిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గంటా రాములు ఎన్నికయ్యారు.
ఓదెల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Basar, Bidrelli, Dhondapur, Kirgul (Buzurg), Kirgul (Khurd), Kowtha, Labdi, Mahadpur, Mailapur, Ratnapur, Ravindrapur, Renukapur, Salapur, Sawargaon, Surli, Takli, Voni
ప్రముఖ గ్రామాలు
కొలనూర్ (Kolanur): కొలనూర్ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన గ్రామము. కొలనూర్ గ్రామంలో సమ్మక్క-సారలమ్మ జాతర చాలా వైభవముగా జరుగుతుంది. గ్రామంలో రైల్వేస్టేషన్ ఉంది. ఓడెల (Odela): ఓడెల పెద్దపల్లి జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఓదెల గ్రామ సమీపంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లిఖార్జున స్వామి దేవస్థానం కలదు. ఓదెల మల్లన్నగా ఖ్యాతిగాంచిన ఈ దేవాలయం తెలంగాణా లో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రాల్లో ఒకటి. ఓదెలలో రైల్వేస్టేషన్ ఉంది. ఓదెల రైల్వేస్టేషన్ పేరుతో సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు ఈ గ్రామస్థుడే మరియు సినిమా మొత్తం గ్రామంలోనే నిర్మిస్తున్నారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Odela Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి