21, ఏప్రిల్ 2020, మంగళవారం

శీలం శయాజీరావు (Sheelam Sayaji Rao)

శీలం శయాజీరావు
జననంమే 18, 1896
పదవులుశాసనసభ స్పీకర్, లెఫ్టినెంట్ గవర్నర్
మరణం1980
మహారాష్ట్ర రాజకీయాలలో ప్రముఖుడిగా చెలామణి అయిన శీలం శయాజీరావు తెలంగాణకు చెందిన తెలుగు వ్యక్తి. మే 18, 1896న బొంబాయిలో జన్మించిన శయాజీరావు మహారాష్ట్రలోనే స్థిరపడి తెలుగువారి కోసం కృషిచేశారు. ఆయన కుటుంబం నాందేడ్ జిల్లా (అప్పటి హైదరాబాదు రాజ్యం)కు చెందినది. జాతీయోద్యమం సమయంలో స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలుకు కూడా వెళ్ళారు. 1917లో తెలుగువారికై తెలుగుమిత్ర అనే మాసపత్రికను నెలకొల్పారు. రాజకీయాలలో ప్రవేశించి 1951లోనే బొంబాయి శాసనసభకు ఎన్నికైనారు. ఉమ్మడి బొంబాయి రాష్ట్ర స్పీకరుగా కూడా పనిచేశారు.

1960లో ముంబాయి రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన మహారాష్ట్రలో శాసనసభ తొలి స్పీకరుగా శీలం శయాజీరావు పనిచేశారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ విభజన అనంతరం ఇందిరా కాంగ్రెస్ వైపు ఉండి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1980లో మరణించిన శయాజీరావుకు గుర్తుగా ముంబాయిలోని ఒక ఫ్లైఓవర్‌కు ఆయన పేరుపెట్టబడింది.

ఇవి కూడా చూడండి:
  • మహారాష్ట్ర స్పీకర్ల జాబితా,
  • పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ల జాబితా,
  • ఇతర రాష్ట్రాలలో పేరుపొందిన తెలంగాణ వ్యక్తులు,

హోం
విభాగాలు: మహారాష్ట్ర ప్రముఖులు, తెలంగాణ ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక