ముస్తాబాదు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలము. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో దక్షిణం వైపున సిద్ధిపేట జిల్లా సరిహద్దులో ఉంది. మండల ఉత్తర సరిహద్దు గుండా మానేరు నది ప్రవహిస్తోంది. నామాపూర్ వద్ద పాలగుట్టలో రంగురాళ్ళు లభిస్తాయి. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో దక్షిణం వైపున సిద్ధిపేట జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన ఎల్లారెడ్డిపేట మండలం, తూర్పున తంగెళ్ళపల్లి మండలం, పశ్చిమాన గంభీరావుపేట మండలం, దక్షిణాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండల ఉత్తర సరిహద్దు గుండా మానేరు నది ప్రవహిస్తోంది. రాజకీయాలు: ఈ మండలము సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన జనగామ శరత్‌రావు, జడ్పీటీసిగా తెరాసకు చెందిన గుండం నర్సయ్య ఎన్నికైనారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 43886. ఇందులో పురుషులు 21856, మహిళలు 22030. అక్షరాస్యుల సంఖ్య 23492.
ముస్తాబాదు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Avunoor, Bandankal, Cheekod, Chippalapalli, Gudem, Gudur, Kondapur, Maddikunta, Moinkunta, Moraipalli, Morrapur, Mustabad, Namapur, Pothugal, Terlumaddi, Turkapalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అవునూరు (Avunoor): అవునూరు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండలమునకు చెందిన గ్రామము. 2019 ఎంపీటీసి ఎన్నికలలో అవునూరు ఎంపీటీసి స్థానం నుంచి భాజపాకు చెందిన సౌల్ల లలిత విజయం సాధించారు.
బండలింగంపల్లి (Bandalindampally):
బండలింగంపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంకు చెందిన గ్రామము. తెలంగాణ ఉద్యమంలో పేరుగాంచిన వీరులారా వందనం ఉద్యమ పాట రచించిన మరియు దరువు కళాసంస్థ స్థాపకుడైన దరువు ఎల్లన్న స్వగ్రామం.
మోమినికుంట (Mominikunta):
మోమినికుంట రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండలానికి చెందిన గ్రామము. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్వీకులది ఈ గ్రామమే.
నామాపూర్ (Namapur):
నామాపూర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండలమునకు చెందిన గ్రామము. నామాపూర్ వద్ద పాలగుట్టలో రంగురాళ్ళు లభిస్తాయి. రాజకీయ నాయకుడు కె.కె.మహేందర్ రెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. 2009లో సిరిసిల్ల నుంచి ఇండీపెండెంటుగా పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయారు. 2010 ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mustabad Mandal, Rajanna Sirisilla Dist (district) Mandals in telugu, Rajanna Sirisilla Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి