కోనారావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలము. సిరిసిల్ల రెవెన్యూ డివిజన్, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్న ఈ మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 28 గ్రామపంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలము జిల్లాలో పశ్చిమం వైపున నిజామాబాదు జిల్లా సరిహద్దులో ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 40488. మండలం గుండా మానేరు ఉపనది అయిన మూలవాగు ప్రవహిస్తోంది. ప్రముఖ ఆర్థికవేత్త సీహెచ్ హనుమంతరావు, రాజకీయ నాయకులు సీహెచ్ రాజేశ్వరరావు, సీహెచ్ విద్యాసాగరరావు, సీహెచ్ రమేష్, కర్రోల్ల నర్సయ్య ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన చందుర్తి మండలం, ఈశాన్యాన వేములవాడ గ్రామీణ మండలం, తూర్పున వేములవాడ మండలం, ఆగ్నేయాన సిరిసిల్ల మండలం, దక్షిణాన ఎల్లారెడ్డిపేట మండలం, పశ్చిమాన వీర్నపల్లి మండలం, వాయువ్యాన నిజామాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. రాజకీయ నాయకులు సీహెచ్ రాజేశ్వరరావు, సీహెచ్ విద్యాసాగరరావు, సీహెచ్ రమేష్, కర్రోల్ల నర్సయ్యలు ఈ మండలమునకు చెందినవారు. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన చంద్రయ్య గౌడ్, జడ్పీటీసిగా తెరాసకు చెందిన అరుణ న్యాలకొండ ఎన్నికైనారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 40488. ఇందులో పురుషులు 19915, మహిళలు 20573. అక్షరాస్యుల సంఖ్య 21909.
కోనారావుపేట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bavusaipeta, Dharmaram, Kanagarthi, Kolanur, Konaraopet, Kondapuram(PR), Lachapet, Malkapet, Mamidipalle, Marrimadla, Marthanpet, Nagaram, Nimmapalle, Nizamabad, PalleMakta, Ramannapet, Sivangalapalle, Suddala, Vattimalla, Venkatraopeta
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
మల్కపేట (Malkapet): మల్కపేట రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలమునకు చెందిన గ్రామము. 1957లో సిరిసిల్ల-నేరల్ల ఉమ్మడి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కర్రోల్ల నర్సయ్య ఈ గ్రామానికి చెందినవారు. నాగారం (Nagaram): నాగారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ ఆర్థికవేత్త సీహెచ్ హనుమంతరావు, రాజకీయ నాయకులు సీహెచ్ రాజేశ్వరరావు, సీహెచ్ విద్యాసాగరరావు ఈ గ్రామమునకు చెందినవారు. నిమ్మపల్లి (Nimmapalli): నిమ్మపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన పలువురు పోరాటయోధులు నిజాం విమోచనోద్యమంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Konaraopet Mandal, Rajanna Sirisilla Dist (district) Mandals in telugu, Rajanna Sirisilla Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి