బచ్చన్నపేట జనగామ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 26 గ్రామపంచాయతీలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలోని కొన్నెగుట్టలో ఆదిమానవుల ఆనవాళ్ళు ఉన్నట్లుగా గుర్తించారు.
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలోకి చేరింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో పశ్చిమాన సిద్ధిపేట మరియు యాదాద్రి జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున నర్మెట్ట మండలం మరియు జనగామ మండలం, దక్షిణాన యాదాద్రి భువనగిరి జిల్లా, ఉత్తరాన మరియు పశ్చిమాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: జనగామ నుంచి సిద్ధిపేట వెళ్ళు రహదారి ఈ మండలం మీదుగా వెళ్తుంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44250. ఇందులో పురుషులు 22109, మహిళలు 22141. రాజకీయాలు: ఈ మండలము జనగామ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బావండ్ల నాగజ్యోతి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన భాగ్యలక్ష్మి గరబోయిన ఎన్నికయ్యారు.
బచ్చన్నపేట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Alimpur, Bachannapet, Bandanagaram, Basireddipalli, Chinnaramancherla, Dubbaguntapalli, Gangapur, Itikyalapalli, Katkoor, Kesireddipalli, Kodavatoor, Konne, Lakshmapur, Lingampalli, Mansanpalli, Nagireddipalli, Narayanapur, Padamati Keshavapur, Pochannapet, Pullaguda, Ramachandrapur, Salvapur, Tammadapalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కొడువటూరు (Koduvatur):
కొడువటూరు వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలమునకు చెందిన గ్రామము. వైశాఖ మాసంలో సిద్ధేశ్వరుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bachannapet Mandal in Telugu, Jangoan Dist (district) Mandals in telugu, Janagoan Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి