21, మే 2020, గురువారం

నాథూరాం గాడ్సే (Nathuram Godse)

నాథూరాం గాడ్సే
జననంమే 19, 1910
స్వస్థలంబారామతి
ప్రత్యేకతగాంధీజీ హంతకుడు
మరణంనవంబరు 15, 1949
హిందూ జాతీయవాదిగా, ఆరెస్సెస్ మరియు హిందూమహాసభ కార్యకర్తగా పేరుపొందిన నాథూరాం గాడ్సే మే 19, 1910న మహారాష్ట్రలోని బారామతిలో జన్మించాడు. జనవరి 30, 1948న ఢిల్లీలో జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసి గాంధీజీ హంతకుడిగా పేరుపొందాడు. ఈయనపై విచారణ జరిపి నవంబరు 15, 1949న అంబాలా సెంట్రల్ జైలు (హర్యానా)లో గాడ్సే ఉరిశిక్ష విధించారు

బారామతిలో జన్మించిన నాథూరాం అసలుపేరు రామచంద్ర వినాయక్ గాడ్సే. చిన్నవయస్సులో ఈయనను తల్లిదండ్రులు కొన్ని నమ్మకాల కారణంగా ఆడపిల్లగా పోషించారు. ముక్కుకు రింగు కూడా పెట్టారు. దీనివల్ల నాథూరాం అనే పేరువచ్చింది (నాథూరాం అనగా అర్థం ముక్కురింగు). విద్యార్థిదశలోనే ఈయన ఆరెస్సెస్ కార్యకర్తగా చేరారు. ఆ తర్వాత హిందూమహాసభలో కూడా పనిచేశారు. గోల్వార్కర్ లాంటి హిందూజాతీయవాదులతో కలిసి పనిచేశారు. ప్రారంభంలో మహాత్మాగాంధీనీ విపరీతంగా అభిమానించేవారు. 1940 తర్వాత గాంధీ సిద్ధాంతాల నుంచి దూరం జరగడం ఆరంభించి దేశ విభజన తర్వాత గాంధీ ముస్లింల రాజకీయ హక్కులకై పోరాడటం ఈయన్ను కలచివేసింది. ఈ కారణంతోనే గాంధీజీని హతమార్చినట్లుగా ఈయన సోదరుడు గోపాళ్ గాడ్సే పేర్కొన్నాడు. 2015లో "దేశ్‌భక్త్ నాథూరాం గాడ్సే" పేరుతో డాక్యుమెంటరీ నిర్మించబడింది.


ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: మహారాష్ట్ర వ్యక్తులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక