చిల్పూర్ జనగామ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకు క్రితం స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో ఉన్న 12 రెవెన్యూ గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటు చేశారు. అదేసమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలోకి మారింది. సికింద్రాబాదు-కాజీపేట రైల్వేలైన్ మండలం గుండా వెళ్ళుచున్నది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణాన స్టేషన్ ఘన్‌పూర్ మండలం, పశ్చిమాన తరిగొప్పుల మండలం, నైరుతిన నర్మెట్ట మండలం, ఉత్తరాన మరియు తూర్పున వరంగల్ పట్టణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: సికింద్రాబాదు-కాజీపేట రైల్వేలైన్, మరియు హైదరాబాదు వరంగల్ ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 70540. ఇందులో పురుషులు 35265, మహిళలు 35275. రాజకీయాలు: ఈ మండలము స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బొమ్మిశెట్టి సరిత, జడ్పీటీసిగా తెరాసకు చెందిన పాగల సంపత్‌రెడ్డి ఎన్నికయ్యారు.
చిల్పూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Chilpur, Chinnapendyala, Fathepur, Kondapur, Krishnajigudem, Lingampalli, Malkapur, Nashkal, Pallagutta, Rajavaram, Sreepathipalli, Venkatadripet
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఫతేపూర్ (Fathepur):
ఫతేపూర్ జనగామ జిల్లా చిల్పూర్ మండలమునకు చెందిన గ్రామము. గ్రామపరిషిలో వెంకటేశ్వర క్రషర్స్ కర్మాగారం ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Chilpur Mandal in Telugu, Jangoan Dist (district) Mandals in telugu, Janagoan Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి