దేవరుప్పుల జనగామ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 32 గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన తొలి యోధుడు దొడ్డి కొమురయ్య మండలంలోని కడవెండి గ్రామానికి చెందినవారు. నిజాం సంస్థానంలో ఈ గ్రామము విస్నూర్ గడిలో భాగము. అప్పుడు ఇది నల్గొండ జిల్లాలో ఉండేది.
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలోకి చేరింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన రఘునాథపల్లి మండలం, తూర్పున పాలకుర్తి మండలం, ఆగ్నేయాన కొడకండ్ల మండలం, పశ్చిమాన గుండాల మండలం, వాయువ్యాన లింగాల ఘన్‌పూర్ మండలం, దక్షిణాన సూర్యాపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: జనగామ సూర్యాపేట రహదారి మండలం మీదుగా వెళ్తుంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42221. ఇందులో పురుషులు 21227, మహిళలు 20994. అక్షరాస్యత శాతం 55.86%. రాజకీయాలు: ఈ మండలము పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బస్వ సావిత్రి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన భార్గవి పల్లా ఎన్నికయ్యారు.
దేవరుప్పుల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Chowdur, Devaruppula, Dharamapur, Gollapalli, Kadavendi, Kolkonda, Madhapuram, Madoorkalan, Madoorkhurd, Manpahad, Neermiala, Ramrajpalli, Singarajpalli,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కడవెండి (Kadavendi):
కడవెండి వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలమునకు చెందిన గ్రామము. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Devaruppula Mandal in Telugu, Jangoan Dist (district) Mandals in telugu, Janagoan Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి