రామగిరి పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 16 గ్రామపంచాయతీలు, 15 రెవెన్యూ గ్రామాలు కలవు. తెలంగాణలోని ప్రముఖ దుర్గాలలో ఒకటైన రామగిరి ఖిల్లా ఈ మండలంలో ఉంది. ఈ మండలము మంథని అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలపు ఉత్తర సరిహద్దు గూండా గోదావరి నది ప్రవహిస్తోంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. కమాన్‌పూర్ మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలు, ముత్తారం మండలంలోని 3 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలానికి చెందిన ఆదివారంపేట గ్రామపంచాయతి 2018 సంవత్సరానికి గాను ఈ గ్రామం జాతీయస్థాయిలో స్వచ్ఛ భారత్ పురస్కారం (నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గరవ్ గ్రామపురస్కార్) పొందింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున మంథని మండలం, దక్షిణాన ముత్తారం మండలం మరియు శ్రీరాంపూర్ మండలం, పశ్చిమాన కమాన్‌పూర్ మండలం మరియు రామగుండం మండలం, ఉత్తరాన మంచిర్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తర సరిహద్దు గూండా గోదావరి నది ప్రవహిస్తోంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 75023. ఇందులో పురుషులు 37870, మహిళలు 37153. పట్టణ జనాభా 18080, గ్రామీణ జనాభా 56943. స్త్రీపురుష నిష్పత్తి (981/వెయ్యి పురుషులకు). రవాణా సౌకర్యాలు: పెద్దపల్లి నుంచి మంథని వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము మంథని అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన ఆరెళ్లి దేవక్క, జడ్పీటీసిగా తెరాసకు చెందిన మ్యాదరనేని శారద ఎన్నికయ్యారు.
రామగిరి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Adivarampet, Begumpet, Budhavarampet, Jallaram, Kalvacherla, Ladnapur, Lonkakesaram, Medipalli (w), Mustiala, Nagepalli, Pannur, Ratnapur, Sundilla, Upperlakesaram, Velgalpahad
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఆదివారంపేట (Aadivarampet): ఆదివారంపేట పెద్దపల్లి జిల్లా రామగిరి మండలమునకు చెందిన గ్రామము. 2018 సంవత్సరానికి గాను ఈ గ్రామం జాతీయస్థాయిలో స్వచ్ఛ భారత్ పురస్కారం (నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గరవ్ గ్రామపురస్కార్) పొందింది. సుందిళ్ళ (Sundilla): సుందిళ్ళ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలమునకు చెందిన గ్రామము. సుందిళ్లలో లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Ramagiri Mandal in Telugu, Peddapalli Dist (district) Mandals in telugu, Peddapalle Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి