పెద్దపల్లి పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 17 ఎంపీటీసి స్థానాలు, 30 గ్రామపంచాయతీలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా రైల్వేమార్గం వెళ్ళుచున్నది. పెద్దపల్లి, రాఘవాపూర్‌లలో రైల్వేస్టేషన్లు కలవు. నవంబరు 24, 2011న పశ్చిమ బెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్ కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు పెద్దపల్లికి చెందినవారు. మండలంలోని పెద్దబొంకూర్ ప్రాచీనమైన గ్రామము.
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన పాలకుర్తి మండలం, తూర్పున కమాన్‌పూర్ మండలం, ఆగ్నేయాన శ్రీరాంపూర్ మండలం, దక్షిణాన ఓదెల మండలం, వాయువ్యాన సుల్తానాబాద్ మండలం, పశ్చిమాన జూలపల్లి మండలం మరియు ఎలిగేడ్ మండలం, వాయువ్యాన ధర్మారం మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మొత్తం 8 మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 142797. ఇందులో పురుషులు 71353, మహిళలు 71444. పట్టణ జనాభా 81562, గ్రామీణ జనాభా 61235. రవాణా సౌకర్యాలు: మండలం గుండా కాజీపేట్-బల్లార్షా రైల్వేలైన్ వెళ్ళుచున్నది. పెద్దపల్లి-నిజామాబాద్ నూతనమార్గం కూడా ఉక్కడి నుంచే ప్రారంభమౌతుంది. దీనితో పెద్దపల్లి రైల్వేజంక్షన్‌గా మారింది. రోడ్డుపరంగా కూడా మంచి వసతులున్నాయి. కరీంనగర్, ధర్మారం, రామగుండం, మంథనిల వైపు నుంచి రహదారులున్నాయి. రాజకీయాలు: ఈ మండలము పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2014లో ఈ మండలానికి చెందిన దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బండారి స్రవంతి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన బండారు రామమూర్తి ఎన్నికయ్యారు.
పెద్దపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Appannapet, Bhojannapet, Brahmanpalli(PS), Cheekurai, Gattusingaram, Gowreddipeta, Kanagarthi, Kothapalli, Maredugonda, Mulasala, Nimmanapalli, Nittur, Palthem, Peddabonkur, Peddakalvala, Peddapalli(CT), Raghavapur, Ragineedu, Rampalli, Rangampalli, Rangapur, Sabitham, Turkalamaddikunta
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అందుగులపల్లి (Andugulapalli): అందుగులపల్లి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలమునకు చెందిన గ్రామము. 2012 సెప్టెంబరు 23 నాడు అందుగులపల్లిలో 90 వెండి నాణేలు బయటపడ్డాయి. కాసులపల్లి (Kasulapalli): కాసులపల్లి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన దాసరి మనోహర్ రెడ్డి ట్రినిటి విద్యాసంస్థల అధినేత. ఈయన 2014లో పెద్దపల్లి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. పెదబొంకూర్ (Pedabonkur): పెదబ్ంకూర్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలానికి చెందిన గ్రామము. ఇది తెలంగాణలో ప్రాచీనమైన గ్రామాలలో ఒకటి. ఇది శాతవాహనుల కాలం నాటి చారిత్రక గ్రామంగా చరిత్రకారులు నిర్థారించారు. ఇక్కడి త్రవ్వకాలలో ఇనుప యుగం నాటి వస్తువులు కూడా బయటపడ్డాయి. పురావస్తుశాఖ పరిశోధనలలో శాతవాహనుల కాలం నాటి బావి, విగ్రహాలు, నాణేలు బయటపడ్డాయి. రాఘవాపూర్ (Raghavapur) రాఘవాపూర్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో రైల్వేస్టేషన్ ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Peddapalli Mandal in Telugu, Peddapalli Dist (district) Mandals in telugu, Peddapalle Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి