రామగుండం పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం మొత్తం పట్టణ ప్రాంతంగానే ఉంది (కార్పోరేషన్‌లో భాగము). తెలంగాణలో అత్యధిక సగటు ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం రామగుండం. మండలపు ఉత్తర సరిహద్దు గూండా గోదావరి నది ప్రవహిస్తోంది. ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజన్, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో భాగమైంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలాన్ని విభజించి 14 రెవెన్యూ గ్రామాలతో కొత్తగా అంతర్గాం మండలాన్ని ఏర్పాటుచేశారు. మరో 8 గ్రామాలు కొత్త ఏర్పడిన పాలకుర్తి మండలంలో కలిపారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున రామగిరి మండలం, దక్షిణాన కమాన్‌పూర్ మండలం, నైరుతిన పాలకుర్తి మండలం, పశ్చిమాన అంతర్గాం మండలం, ఉత్తరాన మంచిర్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలపు ఉత్తర సరిహద్దు గూండా గోదావరి నది ప్రవహిస్తోంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 276794. ఇందులో పురుషులు 140576, మహిళలు 136218. రవాణా సౌకర్యాలు: పెద్దపల్లి నుంచి 16వ నెంబరు జాతీయ రహదారిని కలిపే రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. కాజీపేట బల్హర్షా రైలుమార్గం కూడా మండలం మీదుగా పోవుచున్నది. రాజకీయాలు: ఈ మండలము రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.
రామగుండం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Allur, Jangoan, Malkapur, Malyalapalli, Maredupaka, Medipalli, Poratpalli, Ramagundam
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Ramagundam Mandal in Telugu, Peddapalli Dist (district) Mandals in telugu, Peddapalle Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి