శ్రీరాంపూర్ పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలపు దక్షిణ సరిహద్దు గుండా మానేరు నది ప్రవహిస్తోంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన కమాన్‌పూర్ మండలం, ఈశాన్యాన రామగిరి మండలం, తూర్పున ముత్తారం మండలం, పశ్చిమాన ఓదెల మండలం, వాయువ్యాన పెద్దపల్లి మండలం, దక్షిణాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలపు దక్షిణ సరిహద్దు గుండా మానేరు నది ప్రవహిస్తోంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 41960. ఇందులో పురుషులు 21058, మహిళలు 20902. రవాణా సౌకర్యాలు: రాజకీయాలు: ఈ మండలము పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. పెద్దపల్లి నుంచి 3 సార్లు శాసనసభకు ఎన్నికైన గీట్ల ముకుందరెడ్డి ఈ మండలమునకు చెందినవారు. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన టి.సంపత్, జడ్పీటీసిగా తెరాసకు చెందిన వంగా తిరుపతిరెడ్డి ఎన్నికయ్యారు.
శ్రీరాంపూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Edulapuram, Gangaram, Jafarkhanpet, Kistampet, Kunaram, Madipalli, Mallial, Mangapet, Mirzampet, Motlapalli, Pandilla, Peddampet, Pegadapalli, Rathupalli, Srirampur, Tharupalli, Vennampalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కునారం (Kunaram): కునారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది. అక్టోబరు 7, 2007న అప్పటి వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. పెద్దపల్లి నుంచి 3 సార్లు శాసనసభకు ఎన్నికైన గీట్ల ముకుందరెడ్డి ఈ గ్రామమునకు చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Srirampur Mandal in Telugu, Peddapalli Dist (district) Mandals in telugu, Peddapalle Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి