10, జూన్ 2020, బుధవారం

కిరణ్ బేడి (Kiran Bedi)

జననంజూన్ 9, 1949
జన్మస్థానంఅమృత్‌సర్
ప్రత్యేకతభారతదేశ తొలి మహిళా ఐపీఎస్ అధికారి
పదవులుపుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్
పోలీస్ అధికారిగా, క్రీడాకారిణిగా, రాజకీయ నాయకురాలిగా ప్రసిద్ధి చెందిన కిరణ్ బేడి జూన్ 9, 1949న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు. చిన్నవయస్సులోనే టెన్నిస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొంది 1966లో తొలిసారిగా జాతీయ జూనియర్ టెన్నిస్ టైటిల్‌ను కూడా సాధించి, ఆ తర్వాత పలు జాతీయస్థాయి టైటిళ్ళను కూడా గెలుచుకుంది. 1975లో పోలీస్ శాఖలో చేరి భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిగా పేరుపొందారు. 1993లో తీహార్ జైలులో ఇన్స్‌పెక్టర్ జనరల్‌గా చేరి జైలులో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి పేరుపొందింది. ప్రభుత్వ సర్వీసులకుగాను 1994లో మెగ్సేసే అవార్డు పొందారు. 2015లో భాజపాలో చేరి 2016లో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా నియమితులైనారు.

రాజకీయాలు:
2007లో పదవికి రాజీనామా చేసి సేవా కార్యక్రమాలు చేపట్టి, 2011లో అన్నాహజారే, కేజ్రీవాల్‌లతో పాటుగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 2015లో భారతీయ జనతాపార్టీలో చేరి ఢిల్లీ శాసనసభ ఎన్నికల సమయంలో భాజపా తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కాని ఆ ఎన్నికలలో భాజపా ఓడిపోయింది. 2016లో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా నియమితులైనారు.

గుర్తింపులు:
1994లో ఆసియా నోబుల్ బహుమతిగా పరిగణించబడే రామన్ మెగ్సేసే పురస్కారం పొందగా, 2004లో ఐక్యరాజ్యసమితి మెడల్, 2005లో మదర్ థెరీసా జాతీయ స్మారక అవార్డు స్వీకరించారు. ఇవి కాకుండా పలు ఇతర అవార్డులు కూడా పొందారు. 1990లో తీసిన తెలుగు సినిమా కర్తవ్యం కిరణ్ బేడి జీవితం ఆధారంగా తీయబడింది


హోం
విభాగాలు: పంజాబ్ ప్రముఖులు, భారతదేశ ప్రముఖ మహిళలు, పుదుచ్చేరి,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక