24, జూన్ 2020, బుధవారం

పొట్లపల్లి రామారావు (Potlapalli Ramarao)

జననంనవంబరు 20, 1917
స్వస్థలంతాటికాయల
రంగంకథా రచయిత
మరణంసెప్టెంబర్‌ 10, 2001
తెలంగాణ తొలితరం కథారచయితలలో ప్రముఖుడైన పొట్లపల్లి రామారావు నవంబరు 20, 1917న వరంగల్లు పట్టణ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయలలో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఈయన చిన్న వయస్సులో ఉన్నప్పుడే తండ్రి మరణించడంతో చదువు కూడా ఆగిపోయింది. గ్రామంలోనే ఉంటూ ప్రకృతిని, వ్యక్తులను పరిశీలిస్తూ ప్రత్యేక లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. కొంతకాలం తర్వాత వరంగల్ వెళ్ళి గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ చదివేశారు. ఆ విధంగా రచనలవైపు మార్గం ఏర్పాటుచేసుకున్నారు.

ఈయన రచనల్లో తెలంగాణ సాయుధ పోరాటకాలం నాటి గ్రామీణ జీవనం కనిపిస్తుంది. నిజాం నిరంకుశ పాలననుండి విముక్తం కావడం కోసం పోరాటానికి ఈయన కథలు ప్రేరణ ఇచ్చాయి.

పొట్లపల్లి రామారావు కవిత్వాన్ని మొట్టమొదట దేశోద్ధారక గ్రంథమాల పక్షాన "ఆత్మవేదన" పేరుతో వట్టికోట ఆళ్వారు స్వామి ప్రచురించారు. పొట్లపల్లి రామారావు సెప్టెంబర్‌ 10, 2001న హైదరాబాద్‌లో మరణించారు. "పొట్లపల్లి రామారావు వ్యక్తిత్వం-సాహిత్యం"పై భూపాల్ రెడ్డి పరిశొధన చేసి డాక్టరేట్ పొందారు

ఈయన రచనల్లో ముఖ్యమైనవి జైలుకథలు, ఆత్మవేదన, చుక్కలు, మెఱుపులు, అక్షరదీప్తి, నాలోనేను. పిల్లలకోసం "ముల్ల" కథలు రాశారు.


ఇవి కూడా చూడండి:
  • ధర్మసాగర్ మండలం,
  • జైలుకథలు (కథాసంపుటి)


హోం
విభాగాలు: వరంగల్ పట్టణ జిల్లా ప్రముఖులు, తెలంగాణ రచయితలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక