24, జూన్ 2020, బుధవారం

పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose)

జననంఆగస్టు 8, 1950
స్వస్థలంహసన్‌బాద్‌ (తూర్పు గోదావరి)
రంగంరాజకీయ నాయకుడు
పదవులు3సార్లు ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడైన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగస్టు 8, 1950న తూర్పు గోదావరి జిల్లా హసన్‌బాద్‌లో జన్మించారు. జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించి సర్పంచిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ముగ్గురు ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్రమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

రాజకీయ ప్రస్థానం:
పిల్లి సుభాష్ చంద్రబోస్ 1978లో జిల్లా పరిషత్తు కోఆప్షన్ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1983లో స్వగ్రామం హసన్‌బాద్ సర్పించిగా విజయం సాధించారు. 1989లో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికైనారు. 2004 మరియు 2009లలో కూడా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1999, 2012 ఉప ఎన్నికలో మరియు 2014లో తెలుగుదేశం పార్టీకి చెందిన తోట త్రిమూర్తులు చేతిలో ఓడిపోయారు. 2019లో మండపేట నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున పోటీచేసి తెదేపా అభ్యర్థి వి.జోగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఎమ్మెల్సీగా ఎన్నికై జూన్ 2019లో జగన్ కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి పొందారు. 2020 జూన్‌లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

వైఎస్సార్,రోశయ్య, జగన్ మంత్రివర్గాలలో పనిచేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ పక్షాన ఉండి వైకాపా బలమైన మద్దతుదారుగా పేరుపొందారు.


ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక