ఖానాపూర్ వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 20 గ్రామపంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలు కలవు. కాకతీయుల కాలం నాటి పాకాల చెరువు, పాకాల అభయారణ్యం ఈ మండలంలోనే ఉంది. మున్నేరువాగు మండలం గుండా ప్రవహిస్తోంది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వరంగల్ గ్రామీణ జిల్లాలో భాగంగా మారింది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం వరంగల్ గ్రామీణ జిల్లాలో తూర్పు వైపున మహబూబాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన నల్లబెల్లి మండలం, పశ్చిమాన నర్సంపేట మండలం, నైరుతిన చెన్నారావుపేట మండలం, తూర్పున మరియు దక్షిణాన మహబూబాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 32169. ఇందులో పురుషులు 16126, మహిళలు 16043.
రాజకీయాలు:
ఈ మండలము నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన వి.ప్రకాష్ రావు, జడ్పీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన బాతిని స్వప్న ఎన్నికయ్యారు.
ఖానాపూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Ainepalli, Budharaopet, Dabeerpet, Dharmaraopet, Khanapur, Kothur, Mangalavaripet, Pakhalashoknagar, Ragampet, Rangapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Khanapur Mandal in Telugu, Warangal Rural Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి