25, జులై 2020, శనివారం

కుక్కుట శాస్త్రం (Kukkuta Sastra)



పందెం కోడిపుంజుల గురించి తెల్పబడే శాస్త్రానికే కుక్కుట శాస్త్రం అని పేరు. సంస్కృత భాషలో కుక్కుటము అనగా కోడిపుంజు. కృష్ణా, గోదావరి నదుల మధ్యనున్న తీరాంధ్ర జిల్లా ప్రాంతాలలో కుక్కుట శాస్త్రాన్ని సంక్రాంతి పండుగ సమయాల్లో కోడి పందెములు వేసేటప్పుడు చదువుతారు. కోడి పుంజుల సంరక్షణ, కోడి పుంజుల వర్గీకరణ, ఏ సమయాల్లో పందెము వేయాలి, కోడి పుంజు జన్మ నక్షత్రము, కోడి పుంజు జాతకము మొదలగు విషయాలు ఈ శాస్త్రములో వివరించబడతాయి.

కుక్కుట శాస్త్రాన్ని ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు అనే విషయాలు తెలియవు కాని, బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం తర్వాత ఇది ప్రాచుర్యం పొందినట్లు తెలుస్తోంది. శతాబ్దాల కాలం నుండి ఆంధ్ర క్షత్రియులు (రాజులు) తమ పౌరుషానికి ప్రతీకగా సంక్రాంతి రోజుల్లో కుక్కుట శాస్తాన్ని ఆచరిస్తూ కోడి పందాలను నిర్వహించేవారు. చట్టబద్దం కాకపోయినా ఈ పందాలు కొన్నిచోట్ల ఇంకా నిర్వహించబడుతున్నాయి.
 
భారతదేశంలో కోడి పందాలు
భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి అధికంగా జరుగుతాయి. క్రీ.శ.12వ శతాబ్దిలో పల్నాటియుద్ధం ఫలితం కోడి పందాల ద్వారా నిర్ణయించబడిందని చరిత్రద్వారా తెలుస్తుంది. తరువాత ఆంధ్రదేశంలో కోడిపందాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. కోడిపందాల కోసం ప్రత్యేకంగా కోడిపుంజులను పెంచుతారు. పందెంలోకి వెళ్ళే కోడిపుంజుని పందెంకోడి అని పిలుస్తారు. వాటి కాళ్ళకు కత్తులు, బ్లేడ్లు కట్టి పందానికి పంపుతారు. సాధారణంగా ఈ పోరాటంలో ఒక కోడి మరణిస్తుంది లేదా తీవ్రంగా గాయపడుతుంది. కోడిపుంజులకు ఏడాది పొడవునా పోరాటాల కోసం శిక్షణ ఇస్తుంటారు.

జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టం 1960 ను అమలు చేసినప్పటి నుండి భారతదేశంలో కోడిపందాలు చట్టవిరుద్ధం. 2015 లో సుప్రీంకోర్టు, 2016 లో హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులు నిషేధాన్ని సమర్ధించాయి. కత్తులు, బ్లేడ్లు ఉపయోగించకుండా మరియు జూదం లేదా బెట్టింగ్ లేకుండా ఈ పద్ధతిని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడానికి 2018 జనవరిలో సుప్రీంకోర్టు అనుమతించింది. 

2011లో తమిళంలో తీసిన "ఆడుకాలం" సినిమా ప్రధాన వృత్తాంతం కోళ్ళపందాల గురించి ఉంది.



ఇవి కూడా చూడండి:
  • సంక్రాంతి పండుగ,
  • కడక్‌నాథ్ కోడి,

హోం
విభాగాలు: శాస్త్రాలు, 


 = = = = =

ఆధార గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక