16, జులై 2020, గురువారం

తూమాటి దోణప్ప (Tumati Donappa)

తూమాటి దోణప్ప
జననంజూలై 1, 1926
రంగంసాహితీవేత్త,
పదవులురిజిష్ట్రార్,
మరణంసెప్టెంబరు 6, 1946
సాహితీవేత్తగా, రిజిష్ట్రార్‌గా పేరుపొందిన తూమాటి దోణప్ప జూలై 1, 1926న (ఇది అసలు తేది కాదు, పాఠశాల రికార్డుల ప్రకారమే) అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకట్లలో జన్మించారు. ఈయన అసలుపేరు దోణతిమ్మారాయ చౌదరి. చిన్న వయస్సులోనే నాటకాలలో పనిచేయడమే కాకుండా విద్యార్థి దశలోనే రచనల వైపు దృష్టిసారించారు. విద్యార్థి దశలోనే గురువు నుంచి ఆశుకవిత్వం నేర్చుకున్నారు.

1953లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ.పట్టా పొందడమే కాకుండా స్వర్ణపతకం కూడా పొందారు. "తెలుగులో వైకృతపదాలు" అనే అంశంపై పరిశోధించి 1966లో పి.హెచ్.డి పొందిన దోణప్ప మొదట ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపన్యాసకులుగా నియమితులై, ఆ తర్వాత ఆంధ్రా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేశారు.

1976లో నాగార్జున విశ్వవిశ్వవిద్యాలయం ఏర్పడినప్పుడు తెలుగుశాఖ అధ్యక్షులుగా పనిచేసి, తర్వాత 1980-81లో ఆ విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ అయ్యారు. 1986లో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడినప్పుడు తొలి వైస్ ఛాన్సలర్‌గా నియమితులైనారు.

ఈయన ప్రముఖ రచనలు: ఆంధ్ర సంస్థానాలు-సాహిత్య పోషణ, జానపద కళాసంపద, తెలుగు హరికథా సర్వస్వం, భాషా చారిత్రక వ్యాసావళి. విద్యార్థులకోసం దోణప్ప "బాలల శబ్ద రత్నాకరం" రచించారు. ఈయన సెప్టెంబరు 6, 1946న మరణించారు.


ఇవి కూడా చూడండి:
  • ఉరవకొండ మండలం,
  • ఆంధ్ర సంస్థానాలు-సాహిత్య పోషణ (గ్రంథం),



హోం
విభాగాలు: అనంతపురం జిల్లా ప్రముఖులు, తెలుగు సాహితీవేత్తలు,


 = = = = =


Tags: Biography of Tumati Donappa, Rigistrar of Andhra university and Telugu Univiersity

1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక