2, ఆగస్టు 2020, ఆదివారం

అమర్‌సింగ్ (Amar Singh)

జననం
జనవరి 27, 1956
స్వస్థలం
ఆజంగఢ్ (UP)
రంగం
రాజకీయాలు
పదవులు
3 సార్లు రాజ్యసభ సభ్యుడు
మరణం
ఆగస్టు 1, 2020
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సమాజ్‌వాది పార్టీ మాజీ నేత అయిన అమర్‌సింగ్ జనవరి 27, 1956న ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జన్మించారు. 1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికై ఆ తర్వాత మరో 2 పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికైన అమర్‌సింగ్ సమాజ్‌వాది పార్టీ స్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. 2008లో యుపిఏ ప్రభుత్వం అమెరికాతో అణుఒప్పందం కుదుర్చుకున్నాక వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న పిదప ఎస్పీ మద్దతుతో యుపిఏ ప్రభుత్వం కొనసాగుటలో కీలకపాత్ర పోషించారు. 2011లో ఇదే విషయంలో ఓటుకు నోటు కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. కీలక నేతగా పేరుపొందిన సమాద్‌వాది పార్టీ నుంచి 2010లో బహిష్కరణకు గురై 2016లో మళ్ళీ ఎస్పీలో చేరి 2017లో మళ్ళీ బహిష్కరించబడ్డారు. అమర్‌సింగ్‌కు అనిల్ అంబానీ, అమితాబ్ బచ్చన్, సుబ్రతారాయ్ తదితర ప్రముఖులతో సన్నిహిత సంబంధాలుండేవి. ఆగస్టు 1, 2020న సింగపూర్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
అమర్‌సింగ్ 1996లో ఉత్తరప్రదేశ్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2003లో రెండో సారి రాజ్యసభకు ఎన్నికైనారు. 2008లో మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం అమెరికాతో అణుఒపందం చేసుకున పిదప వామపక్షాలు యుపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాయి. ఆ సమయంలో కీలకంగా వ్యవహరించి ఎస్పీ మద్దతుతో యుపిఏ ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో సఫలమైనారు. లోక్‌సభ సభ్యులను కొనుగోళు చేశారనే వివాదం (ఓటుకు నోటు కుంభకోణం)లో 2011లో అరెస్ట్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కారణంగా జయప్రదతో పాటు అమర్‌సింగ్ కూడా ఎస్పీ నుంచి బహిష్కరించబడ్డారు. ఎస్పీ నుంచి బహిష్కరించబడినప్పటికీ ములాయం సింగ్ యాదవ్‌తో సఖ్యతగానే ఉండేవారు. ఎస్పీ నుంచి బహిష్కరించబడ తర్వాత రాష్ట్రీయ లోక్‌మంచ్ పార్టీని స్థాపించారు. కాని ఈ పార్టీ 2012 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఒక్క స్థానం కూడా పొందలేదు. తర్వాత రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలో చేరారు. 2014లో ఫతేపూర్ సిక్రీ నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 2016లో ఇండిపెండెంటుగా పోటీచేసి ఎస్పీ మద్దతులో మూడోసారి రాజ్యసభ సభ్యులైనారు. 2016లో ఎస్పీలో తిరిగి చేరిననూ అప్పటికే ఎస్పీలో తండ్రీకొడుకుల మధ్యన వివాదం కొనసాగుతుంది. 2017లో ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ పార్టీ పగ్గాలు చేపట్టిన పిదప మళ్ళీ అమర్‌సింగ్ బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత నరేంద్రమోడీకి, ఆరెస్సెస్‌కు దగ్గరయ్యారు కాని భాజపాలో చేరలేరు. 2020 ఆగస్టులో మరణించేనాటికి ఏ పార్టీలో లేరు.


ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: ఉత్తరప్రదేశ్ ప్రముఖులు, 2020,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక