2, ఆగస్టు 2020, ఆదివారం

ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav)

జననం
నవంబరు 11, 1939
రంగం
రాజకీయాలు
పదవులు
3సార్లు UP ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి,
ప్రముఖ రాజకీయ నాయకుడు, సమాజ్‌వాది పార్టీ స్థాపకుడు అయిన ములాయం సింగ్ యాదవ్ నవంబరు 11, 1939న ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లా సైఫై గ్రామంలో జన్మించారు. 1975లో అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిర అకృత్యాలపై ఉద్యమించి 19 నెలలు జైలులో ఉన్నారు. 1980లో లోక్‌దళ్ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా, 1982-85 కాలంలో ఉత్తరప్రదేశ్ విధానమండలి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.

1989-91 మరియు 1993-95 కాలంలో ఉతరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1992లో సమాజ్‌వాది పార్టీని స్థాపించారు. 1996-98 కాలంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం సమయంలో (దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్ ప్రధానమంత్రుల కాలంలో) కేంద్ర రక్షణశాఖ మంత్రిగా పదవిపొందారు. 2003-07 కాలంలో మూడోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కుమారుడు అఖిలేశ్ యాదవ్ 2012-17 కాలంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.



హోం
విభాగాలు: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఉత్తరప్రదేశ్ ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక