భారత జాతీయ గీతాన్ని బెంగాలీ కవి రవీంద్రనాథ్ టాగూర్ రచించారు. జనగణమన తో ప్రారంభమై ఆయన రాసిన ఐదు చరణాలలో ఒక దానినే భారత జాతీయ గీతంగా రాజ్యాంగం ఆమోదించింది. స్వాతంత్ర్యానికి పూర్వమే 1911 కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా ఈ గీతాన్నిపాడారు. 1912 జనవరి లో ఈ గీతం "తత్వ భోదిని" అనే పత్రికలో "భారత విధాత" అనే పేరుతో ప్రచురితమైంది. 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ఠాగూర్ సృష్టించారు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు సరిగ్గా 52 సెకండ్లు పడుతుంది. ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లెలో ఆంగ్లములోకి "మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా" అనే పేరుతో అనువాదం చేయబడింది. 2005లో జాతీయ గీతంలోని సింధూ పదాన్ని తొలగించి కశ్మీర్‌ను చేర్చాలను సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబడింది. దేశ విభజన సమయంలో సింధూ ప్రాంతం పాకిస్తాన్‌కు వెళ్ళిపోయినందున జాతీయగీతంలో ఉండే అవసరం లేదని వాదించారు. కాని సింధూ అనేది సింధూనదికి, సింధూ సంస్కృతికి చెందినదని, సింధీ ప్రజలు భారత్‌లో కూడా ఉన్నారనీ, భారతదేశానికి ఇండియా పేరు రావడానికి సింధూ (Indus) నది కారణమని కాబట్టి సంస్కృతికి ప్రతిబింబమైన సింధూ పదాన్ని తొలగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
తెలుగులో అర్థం: పంజాబు, సింధు, గుజరాత్ మహారాష్ట్ర లతో కూడిన పశ్చిమ తీర ప్రాంతాము, ద్రావిడ ప్రాంతము, ఉత్కల ప్రాంతము, బెంగాల్ ప్రాంతము వింధ్య హిమాలయ పర్వతాలు, యమున గంగనదులు పై కంటే ఎగసే సముద్ర తరంగాలు ఇవన్నీ.. తమరి శుభ నామమే తలుచుకుంటూ ఉన్నాయి, తమరి శుభ ఆశిస్సులనే కోరుకుంటున్నాయి తమరి విజయగాధనే పాడుకుంటున్నాయి ఓ జనసమూహాల మనసుల అధినాయకా... మీకు జయము! ఓ భారత భాగ్య విధాత, మీకు జయము! నిత్య జయము! ఇవి కూడా చూడండి:
= = = = =
|
13, ఆగస్టు 2020, గురువారం
భారత జాతీయగీతం (National Anthem of India)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి