13, ఆగస్టు 2020, గురువారం

సావిత్రీబాయి ఫూలె (Savitribai Phule)

సావిత్రీబాయి ఫూలె
జననం
జనవరి 3, 1831
రంగం
సంఘసంస్కర్త
ప్రత్యేకత
దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు
మరణం
మార్చి 10, 1897
భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయినిగా పేరుపొందిన సావిత్రీబాయి ఫూలె జనవరి 3, 1831న మహారాష్ట్రలోని సతారా జిల్లా నయిగాన్‌లో జన్మించింది. 9 సం.ల చిన్న వయస్సులోనే 12 సం.ల వయసున్న జ్యోతిరావ్ ఫూలేతో వివాహం అయింది. భర్త జ్యోతిరావు ఫూలె ప్రముఖ సంఘసంస్కర్తగా గుర్తింపు పొందారు. భర్త ద్వారానే సావిత్రీబాయి విద్య అభ్యసించింది. సావిత్రీబాయి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరుపొందింది. భారతదేశ ఫెమినిజం మాతామహులుగా కూడా ఈమెను పరిగణిస్తారు.

1873 లో తన భర్త జ్యోతిరావ్ పూలేతో కలసి "సత్యశోధక్ సమాజ్" స్థాపించి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమించింది. వీరిరువుకు కల్సి 1848లో పూనెలో స్థాపించిన పాఠశాల దేశంలోనే మహిళల కోసం స్థాపించిన తొలి పాఠశాలగా గుర్తింపు పొందింది. ఎన్నో సంఘసంస్కరణలకోసం పాటుపడిన సావిత్రీబాయి మార్చి 10, 1897న మరణించింది. సావిత్రీబాయి, జ్యోతిరావు దంపతులకు సంతానం లేదు. బ్రాహ్మణ వితంతు కుమారుడైన యశ్వంతరావును దత్తత తీసుకున్నారు.

1998లో తపాలాశాఖ సావిత్రీబాయి ముఖచిత్రంలో తపాలాబిళ్ళ విడుదల చేసింది. 2015లో పూనె విశ్వవిద్యాలయానికి సావిత్రీబాయి ఫూలె విశ్వవిద్యాలయంగా పేరుమార్చబడింది.
 
హోం
విభాగాలు: మహారాష్ట్ర ప్రముఖులు, భారతదేశ ప్రముఖ మహిళలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక