భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా 353సి జాతీయ రహదారి వెళ్ళుచున్నది. అక్టోబరు 11, 2016న జిల్లాల పువర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మల్హర్‌రావు మండలం, కాటారం మండలం, ఈశాన్యాన మరియు తూర్పున ముత్తారం మహాదేవ్‌పూర్ మండలం, పశ్చిమాన చిట్యాల మండలం, దక్షిణాన ఘన్‌పూర్ ములుగు మండలం, నైరుతిన రేగొండ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం గుండా 353సి జాతీయ రహదారి వెళ్ళుచున్నది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 86919. ఇందులో పురుషులు 43998, మహిళలు 42921. మండలంలో పట్టణ జనాభా 42195, గ్రామీణ జనాభా 44724.
రాజకీయాలు:
ఈ మండలము భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాస పార్టీకి చెందిన ముదల లావణ్య ఎన్నికైనారు. జడ్పీటీసి సభ్యునిగా తెరాస పార్టీకి చెందిన కల్లెపు శోభ విజయం సాధించారు.
భూపాలపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Azamnagar, Bheemghanpur, Bhupalpalli, Budharam, Chiknepalli, Deekshakunta, Dudekulapalli, Gorlavedu, Gudadupalli, Jangedu, Kamalapur, Kompalli, Kothapalli, Nagaram, Nandigama, Neredpalli, Pambapur, Pandipampula, Peddapur, Rampur, Vajinepalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
భూపాలపల్లి (Bhupalapally): భూపాలపల్లి వరంగల్ జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న భూపాలపల్లి 2012లో నగరపంచాయతీగా, ఆ తర్వాత పురపాలక సంఘంగా మార్చబడింది. 2016 అక్టోబరులో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఇది జిల్లా కేంద్రంగా మారింది. పిన్‌కోడ్ 506169. 2011 ప్రకారం పట్టణ జనాభా సుమారు 42వేలు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bhupalapalli Mandal in Telugu, Jayashankar Bhupalapalli Dist (district) Mandals in telugu, Bhoopalapally Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి