6, ఆగస్టు 2020, గురువారం

సోలిపేట రామలింగారెడ్డి (Solipeta Ramalinga Reddy)

జననం
అక్టోబరు 2, 1961
రంగం
రాజకీయాలు
పదవులు
4 సార్లు ఎమ్మెల్యే
మరణం
ఆగస్టు 6, 2020
రాజకీయ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, జర్నలిస్టుగా పేరుపొందిన సోలిపేట రామలింగారెడ్డి అక్టోబరు 2, 1961న సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ లో జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న రామలింగారెడ్డి ప్రారంభంలో జర్నలిస్టుగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా 2004లో రాజకీయాలలో ప్రవేశించారు. పీపుల్స్‌వార్ తో సంబంధాలున్నాయనే నెపంతో దేశంలోనే మొదటి టాడా కేసు ఈయనపై నమోదైంది. తర్వాత నిర్దోషిగా విడుదలైనారు. 2008 ఉప ఎన్నికతో పాటు 2014, 2018లలో కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆగస్టు 6, 2020న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
2004లో తొలిసారిగా దొమ్మాట నియోజకవర్గం నుంచి తెరాస తరఫున పోటీచేసి శాసనసభకు ఎన్నికైనారు. 2008 ఉప ఎన్నికలో కూడా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో దొమ్మాట రద్దయి దుబ్బాక నియోజకవర్గం ఏర్పడటంతో 2009లో దుబ్బాక నుంచి పోటిచేసి చెరుకు ముత్యంరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో చెరుకు ముత్యంరెడ్డిపై విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర తొలి అంచనాల కమిటి చైర్మెన్‌గా పనిచేశారు. 2018లో కూడా దుబ్బాక నుంచి పోటిచేసి గెలుపొందారు. శాసనసభ్యుడిగా ఉంటూ 2020 ఆగస్టులో మరణించారు.



హోం
విభాగాలు: సిద్ధిపేట జిల్లా ప్రముఖులు, దుబ్బాక మండలం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక