బోనకల్ ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల తూర్పు సరిహద్దు గుండా వైరానది ప్రవహిస్తోంది. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన మరియు వాయువ్యాన చింతకాని మండలం, ఈశాన్యాన వైరా మండలం, తూర్పున మరియు దక్షిణాన మధిర మండలం, పశ్చిమాన ఆంధ్రప్రదేశ్ సరిహద్దులుగా ఉన్నాయి. మండలం మీదుగా కాజీపేట-విజయవాడ రైలుమార్గం వెళ్ళుచున్నది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44000. ఇందులో పురుషులు 22133, మహిళలు 21867. రాజకీయాలు: ఈ మండలము మధిర అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కంకణాల సౌభాగ్య ఎన్నికయ్యారు. రవాణా సౌకర్యాలు:
మండలం గుండా రైలుమార్గం వెళ్ళుచున్నది. డోర్నకల్-విజయవాడ మార్గంలో మండల కేంద్రం బోనకల్లు మరియు మోటమర్రిలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గం దక్షిణమధ్య రైల్వే జోన్‌లో భాగంగా సికింద్రాబాదు డివిజన్ పరిధిలో ఉంది. మండలంలోని గ్రామాలు: Allapadu, Bonakal, Brahmanapalli (K), Chinnabeeravalli, Chirunomula, Choppakatlapalem, Garlapadu, Govindapuram, Kalakota, Laxmipuram, Motamarri, Mustikuntla, Narayanpuram, Peddabeeravalli, Ramapuram, Rapalli, Ravinuthala, Thutikuntla
ప్రముఖ గ్రామాలు: బోనకల్ (Bonakal):బోనకల్ ఖమ్మం జిల్లాఖు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. గ్రామానికి రైలు సదుపాయం ఉంది. గ్రామ పిన్‌కోడ్ 507204. మోటమర్రి (Motamarri): మోటమర్రి ఖమ్మం జిల్లా బోనకల్ మండలమునకు చెందిన గ్రామము. డోర్నకల్-విజయవాడ మార్గంలో గ్రామానికి రైలు సదుపాయం ఉంది.
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bonakal Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి