చింతకాని ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 26 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. డోర్నకల్-విజయవాడ సెక్షన్‌లో చింతకాని, పందిళ్ళపల్లి మరియు నాగులవంచలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన రఘునాథపల్లి మండలం, ఈశాన్యాన కొణిజెర్ల మండలం, తూర్పున వైరా మండలం, దక్షిణాన బోనకల్లు మండలం మరియు ఆంధ్రప్రదేశ్, పశ్చిమాన ముదిగొండ మండలం, వాయువ్యాన ఖమ్మం పట్టణ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం మీదుగా కాజీపేట-విజయవాడ రైలుమార్గం వెళ్ళుచున్నది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49432. ఇందులో పురుషులు 24541, మహిళలు 24891. రాజకీయాలు: ఈ మండలము మధిర అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా ఇండిపెండెంటుకు చెందిన కోపూరి పూర్ణయ్య ఎన్నికయ్యారు. రవాణా సౌకర్యాలు: మండలం గుండా రైలుమార్గం వెళ్ళుచున్నది. డోర్నకల్-విజయవాడ మార్గంలో మండల కేంద్రం చింతకాని, పందిళ్ళపల్లి మరియు నాగులవంచలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గం దక్షిణమధ్య రైల్వే జోన్‌లో భాగంగా సికింద్రాబాదు డివిజన్ పరిధిలో ఉంది. మండలంలోని గ్రామాలు: Ananthasagar, Bashwapuram, Chinnamandava, Chinthakani, Kodumuru, Lachagudem, Mathikepally, Nagiligonda, Nagulavancha, Nerada, Pandillapally, Patharlapadu, Prothutoor, Repallevada, Thimminenipalem, Vandanam
ప్రముఖ గ్రామాలు: చింతకాని (Chintakani):చింతకాని ఖమ్మంజిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. డోర్నకల్-విజయవాడ మార్గంలో చింతకానిలో రైల్వేస్టేషన్ ఉంది. నాగులవంచ (Nagulavancha): నాగులవంచ ఖమ్మంజిల్లా చింతకాని మండలమునకు చెందిన గ్రామము. డోర్నకల్-విజయవాడ మార్గంలో నాగులవంచలో రైల్వేస్టేషన్ ఉంది. పందిళ్ళపల్లి (Pandillapalli): పందిళ్ళపల్లి ఖమ్మం జిల్లా చింతకాని మండలమునకు చెందిన గ్రామము. 2013, జూలై 29న ఈ గ్రామానికి చెందిన సీపీఎం నాయకుడు, న్యాయవాది అలవాల శ్రీనివాసరావు హత్య జరిగింది. డోర్నకల్-విజయవాడ మార్గంలో పందిళ్ళపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది. రామకృష్ణాపురం (Ramakrishnapuram): రామకృష్ణాపురం ఖమ్మం జిల్లా చింతకాని మండలమునకు చెందిన గ్రామము. నవంబరు 24, 2011న గ్రామంలో జరిగిన రచ్చబండకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Chintakani Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి