26, డిసెంబర్ 2020, శనివారం

సతీష్ ధావన్ (Satish Dhawan)

జననం
సెప్టెంబరు 25, 1920
రంగం
అంతరిక్ష శాస్త్రవేత్త
పదవులు
ఇస్రో చైర్మెన్,
పురస్కారాలు
పద్మవిభూషణ్
మరణం
జనవరి 3, 2002
గణితవేత్తగా మరియు ఏరోస్పేస్ ఇంజనీయరుగా పేరుపొందిన సతీష్ ధావన్ సెప్టెంబరు 25, 1920న శ్రీనగర్‌లో పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఈయన భారతదేశ ఎక్స్‌పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ రీసెర్చి పితామహుడిగా పరిగణించబడతారు. భారత అంతరిక్ష రంగంలో ప్రముఖ వ్యక్తులలో ఒకరైన సతీష్ ధావన్ ఇస్రో చైర్మెన్‌గా, ఇండియన్ స్పేస్ కమీష చైర్మెన్‌గా, IISc అధ్యక్షుడిగా పలు పదవులు నిర్వహించారు. సతీష్ ధావన్ జనవరి 3, 2002న బెంగళూరులో మరణించారు. ఈయన కూతురు జ్యోత్స్న మాలిక్యులర్ బయాలిస్ట్‌గా పేరుపొందింది.
 
ప్రస్థానం:
సతీష్ ధావన్ లాహోర్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీపట్టా పొంది అమెరికాలోని మిన్నిసొట విశ్వవిద్యాలయం నుంచి ఏరోస్పేర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏర్నాటికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. 1951లో ఇండీయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో ఫ్యాకల్టీగా ప్రవేశించి దశాబ్దం తర్వాత అదేసంస్థకు డైరెక్తర్ అయ్యారు. 1972లో ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మెన్‌గా పదవి పొందారు. 1984 వరకు ఇస్రో చైర్మెన్‌గా వ్యవహరించారు. 1977-79 కాలంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డైరెక్టరుగా కూడా పనిచేశారు.
 
పురస్కారాలు, గుర్తింపులు:
1971లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, 1981లో పద్మవిభూషణ్ పురస్కారాలు పొందారు. 1999లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు పొందారు. ఈయన గౌరవార్థం శ్రీహరికోటలో షార్ కేంద్రానికి సతీష్ ధావన్ షార్ కేంద్రంగా పేరుపెట్టబడింది. ఐఐటి రోపార్‌కు ధావన్ పేరుపెట్టబడింది. 


ఇవి కూడా చూడండి:
  • ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో),
  • సెప్టెంబరు 25 (చరిత్రలో ఈ రోజు),
  • 1920 (తేదీవారీగా సంఘటనలు),
  • 2002 (తేదీవారీగా సంఘటనలు),

హోం
విభాగాలు: ఇస్రో చైర్మెన్లు, భారత అంతరిక్ష రంగం, 1920, 2002,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక