18, జులై 2021, ఆదివారం

మొవ్వ మండలం (Movva Mandal)

తెలుగు వికీపీడియా చచ్చిపోయిన తర్వాత అంతర్జాలంలో మిగిలిన ఏకైక విజ్ఞాన సర్వస్వం cckraopedia (తెలుగు విజ్ఞాన సర్వస్వం) మాత్రమే.
 
జిల్లాకృష్ణా జిల్లా
జనాభా53054
రెవెన్యూ డివిజన్మచిలీపట్నం
రెవెన్యూ గ్రామాల సంఖ్య
17
పిన్‌కోడ్521135
మొవ్వ కృష్ణా జిల్లాకు చెందిన మండలము. వేణుగోపాలస్వామిపై పదాలు పలికిన క్షేత్రయ్య, త్రివర్ణ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జాస్తి చలమేశ్వర్, గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య, ప్రముఖ వైద్యుడు కాకర్ల సుబ్బారావు ఈ మండలమునకు చెందినవారు. సిద్ధేంద్రయోగిచే కూచిపూడి నాట్యం పుట్టిన కూచిపూడి గ్రామం ఈ మండలంలోనే ఉంది. ఐనంపూడి సమీపంలో చమురు నిక్షేపాలున్నాయి. మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామపంచాయతీలు కలవు. మండలంలోని గ్రామాలన్నీ పూర్వపు మొవ్వ తాలుకాలోనివే. ఈ మండలం బందరు రెవెన్యూ డివిజన్ లో, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం, మచిలీపట్నం లోకసభ నియోజకవర్గంలో బాగంగా ఉంది. 
 
జనాభా:
1981 లెక్కల ప్రకారం 51302. ఇందులో పురుషులు 25695, మహిళలు 25607. జనసాంద్రత 356. 2011 లెక్కల ప్రకారము మండల జనాభా 53054. ఇందులో పురుషులు 26219, మహిళలు 26835. 
 

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
అవురుపూడి, అయ్యంకి, బార్లపూడి, భట్లపెనుమర్రు, చినముత్తేవి, గుడపాడు, కాజ, కోసూరు, కూచిపూడి, మొవ్వ, నిడుమోలు, పలంకిపాడు, పెదముత్తేవి, పెదపూడి, పెడసనగల్లు, వేములమాడ, యద్దనపూడి

ప్రముఖ గ్రామాలు
 
అయ్యంకి (Ayyanki):
అయ్యంకి కృష్ణా జిల్లా మొవ్వ మండలమునకు చెందిన గ్రామము. గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య ఈ గ్రామానికి చెందినవారు.  
 
భట్లపెనుమర్రు (Bhatlapenumarru):
భట్లపెనుమర్రు కృష్ణా జిల్లా మొవ్వ మండలమునకు చెందిన గ్రామము. త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య ఈ గ్రామానికి చెందినవారు. గ్రామంలో అంగడాల సురేష్ పింగళి స్వచ్ఛంద సేవా సంస్థ పేరున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 

ఐనంపూడి (Inampudi):
ఐనంపూడి కృష్ణా జిల్లా మొవ్వ మండలమునకు చెందిన గ్రామము. ఐనంపూడి సమీపంలో ఆయిల్ నిక్షేపాలున్నాయి.

కూచిపూడి (Kuchipudi):
కూచిపూడి కృష్ణా జిల్లా మొవ్వ మండలమునకు చెందిన గ్రామము. సిద్దేంద్రయోగి నాట్యకళారీతులతో ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది. గ్రామం పేరుతో ఇక్కడి నాట్యరీతి కూచిపూడి నాట్యంగా ప్రసిద్ధి చెందింది. కూచిపూడి గ్రామం అసలుపేరు కుశీలపురం. తర్వాత కుచీలపురిగా మారి అనంతరం కూచిపూడి అయినట్లు తెలుస్తుంది. గోల్కొండ నవాబు తానీషా ఈ గ్రామాన్ని కూచిపూడి భాగవతులకు అగ్రహారంగా ఇచ్చాడు.

మొవ్వ (Movva):
మొవ్వ కృష్ణా జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఈ గ్రామం వరదయ్య వల్ల ప్రసిద్ధి చెందింది. గ్రామంలో 2 ప్రముఖ ఆలయాలు కలవు. భీమేశ్వరాలయం, వేణుగోపాలస్వామి ఆలయం ప్రధానమైనవి. ఈ రెండు ఆలయాలు మౌద్గల్యమునిచే ప్రతిష్టించబడినట్లు పౌరాణికుల కథనం. ఈ ఆలయాలలో భీమేశ్వరాలయం కంటే వరదయ్య ద్వారా వేణుగోపాలస్వామికి అధిక ప్రాధాన్యం లభించింది. వరదయ్య రోజూ పశువులను అడవులకు తీసుకెళ్ళేవాడు. ఒకనాడు మౌద్గల్యముని కనిపించాడు. ఆ ముని వర్దయ్యలో దాగియున్న శక్తిని గమనించాడు. వరదయ్య వేణుగోపాలస్వామి మీద పద్యాలు పాడుతూ అనేక క్షేత్రాలు తిరిగాడు. అందుచే అతనికి క్షేత్రయ్య పేరు కూడా ఉంది. అతను పలికిన పదాలే క్షేత్రయ్య పదాలుగా ప్రసిద్ధి చెందాయి. క్షేత్రయ్య వల్ల వేణుగోపాలస్వామికి, మొవ్వ గ్రామానికి కూడా ప్రాధాన్యం లభించింది.

పెద ముత్తేవి (Peda Muttevi):
పెద ముత్తేవి కృష్ణా జిల్లా మొవ్వ మండలమునకు చెందిన గ్రామము. పెదముక్తేవిలో వైష్ణవపీఠం ఉంది. ఇది వైష్ణవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో ప్రధాన ఆలయం లక్ష్మీపతి (విష్ణువు) ఆలయం. 1620లో ఏర్పడిన ఈ ఆలయం స్వయంభువుగా పరిగణిస్తారు. గౌహతి మరియు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఈ గ్రామనికి చెందినవారు.




ఇవి కూడా చూడండి:

\






విభాగాలు: కృష్ణా జిల్లా మండలాలు, , 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక