భూత్పూర్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలము. ఇది జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నది. 44వ నెంబరు జాతీయ రహదారి మరియు మహబూబ్ నగర్- శ్రీశైలం రహదారి మండలం గుండా వెళ్ళుచున్నవి. మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు, 16 గ్రామపంచాయతీలు కలవు. 44వ నెంబరు జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ఈ మండలము మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండల కేంద్రం చారిత్రాత్మకమైన ప్రదేశం. చరిత్రలో బూతపురంగా పిలువబడిన ఈ గ్రామంలో మల్యాల గుండయ భార్య శివాలయం నిర్మించింది. గ్రామంలో ప్రాచీన శాసనం కూడా లభించింది. మండలంలో పెద్ద గ్రామమైన అమిస్తాపూర్ లో సాయి సచ్చిదానంద ఆశ్రమం ఉంది. 2014లో దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. 2019లో స్వర్ణసుధాకర్ రెడ్డి భూత్పూర్ జడ్పీటీసిగా ఎన్నికై జడ్పీ చైర్మెన్ పదవి పొందారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారిణి మహేశ్వరి ఈ మండలానికి చెందినది.
మండల సరిహద్దులు: ఈ మండలమునకు ఉతరమున మహబూబ్‌నగర్ మండలం, ఈశాన్యమున జడ్చర్ల మండలం, తూర్పున తిమ్మాజీపేట మండలం, దక్షిణమున ఘనపూర్ మండలం, పశ్చిమాన అడ్డాకుల మండలము సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 1991 లెక్కల ప్రకారం మండల జనాభా 38820. ఇందులో పురుషులు 19375, మహిళలు 19445. 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 42845. ఇందులో పురుషులు 21634, మహిళలు 21211. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49712. ఇందులో పురుషులు 25202, మహిళలు 24510.
44వ నెంబరు జాతీయ రహదారి మరియు మహబూబ్‌నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నవి. మండలం ఉత్తర భాగం నుంచి కొంతదూరం రైల్వేలైన్ వెళ్ళుచున్ననూ మండలంలో రైల్వేస్టేషన్ లేదు. మహబూబ్ నగర్ మరియు జడ్చర్ల రైల్వేస్టేషన్లు మండలవాసులకు అందుబాటులో ఉన్నాయి. చరిత్ర: చరిత్రలో మండల కేంద్రము బూదపురముగా పిలువబడింది. క్రీ.శ.1272లో గోనమల్యాల వంశానికి చెందిన కుప్పాంబిక (గోనబుద్ధారెడ్డి సోదరి) బూదపురం శాసనం వేయించింది. ఆ కాలంలో వర్థమానపురంను ఏలిన గోనవంశపు రెడ్లు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా తెలుస్తుంది. బూదపురంలో కాకతీయులకు, వర్థమాన పాలకులకు మధ్య పెద్ద యుద్ధం జరిగినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. రాజకీయాలు: ఈ మండలము దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. 12 ఎంపీటీసి స్థానాలలో 10 తెదేపా విజయం సాధించింది. 2006 ఎన్నికలలో మండలంలోని 16 పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ 7, తెలుగుదేశం పార్టీ 6, ఇండిపెండెంట్లు ముగ్గురు గెలుపొందారు. 2013 సహకార సంఘం ఎన్నికలలో భూత్పూర్ సహకార సంఘం 13 డైరెక్టర్ స్థానాలలో పదింటిని తెరాస సాధించింది. 2014 & 2018లలో దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. విద్యాసంస్థలు: మండలంలో 44 ప్రాథమిక పాఠశాలలు (41 మండల పరిషత్తు, 3 ప్రైవేట్), 12 ప్రాథమికోన్నత పాఠశాలలు (7 మండల పరిషత్తు, 5 ప్రైవేట్), 10 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 8 జడ్పీ, 1 పైవేట్), 1 ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది. భూత్పూర్, ఎల్కిచెర్ల, తాడిపర్తి, కరివెన, పోతులమడుగు, తాటికొండ, కొత్తమొల్గర, పాతమొల్గరలలో జిల్లా పరిషత్తు పాఠశాలలు, భూత్పూర్‌లో శ్రీసత్యసాయి గురుకులం ప్రైవేట్ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల కలవు. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 16582 హెక్టార్లలో 40% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న, ప్రత్తి. వరి, జొన్నలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 626 మిమీ. మండలంలో సుమారు 1900 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. కాలరేఖ:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
భూత్పూర్ మండలము (Bhuthpur Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి