24, జనవరి 2013, గురువారం

ఉప్పునూతల మండలము (Uppunuthala Mandal)

జిల్లా నాగర్‌కర్నూల్
రెవెన్యూ డివిజన్ నాగర్‌కర్నూల్
జనాభా29028 (2001)
33438 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంఅచ్చంపేట
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
పర్యాటక ప్రాంతాలుమామిళ్ళపల్లి
ముఖ్య పంటలుమొక్కజొన్న, ప్రత్తి
ఉప్పునూతల నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలో 15 గ్రామపంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలున్నాయి. 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 29028. ఇది జిల్లాలోనే అత్యల్ప జనాభా కల మండలము. మండల సాధారణ వర్షపాతము 745 సెం.మీ. మండల కేంద్రంలో ప్రాచీనమైన కేదారేశ్వరస్వామి ఆలయం ఉంది. మండలం ఉత్తర సరిహద్దు నుంచి దుందుభీనది ప్రవహిస్తోంది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 33438. ప్రముఖ విద్యావేత్తగా, కవిగా పేరుపొందిన పెద్దాపురం రంగారావు ఈ మండలమునకు చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఉప్పునూతల మండలం కేంద్రం 78డి35న"16" రేఖాంశం, 16డి16"42'అక్షాంశరేఖపై ఉంది. మండల విస్తీర్ణం 22278 హెక్టార్లు. ఇందులో 428 హెక్టార్ల అటవీప్రాంతం ఉంది. ఉప్పునూతల మండలం జిల్లాలో తూర్పువైపున నల్గొండ జిల్లా సరిహద్దులో ఉంది. ఉత్తరాన దిండినది సరిహద్దుగా ప్రవహిస్తుండగా దానికి ఆవల వంగూరు మండలం మరియు నల్గొండ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. మండలం భౌగోళికంగా వెడల్పుగా ఉండి తూర్పున మొనతేలి ఉంది దక్షిణన అచ్చంపేట, బల్మూరు మండలాలు, పశ్చిమాన టెలకపల్లి మండలం సరిహద్దుగా ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 29028. ఇందులో పురుషులు 14617, మహిళలు 14411. జిల్లాలోనే ఇది అత్యల్ప జనాభా కల మండలం. ఎస్సీల సంఖ్య 7032, ఎస్టీల సంఖ్య 2669. 2001 జనాభా లెక్కల ప్రకారం మండల కోడ్ 0032. జనసాంద్రత  119/చకిమీ. స్త్రీపురుష్ నిష్పత్తి 984. మండలం మొత్తం గ్రామీణ ప్రాంతమే. అక్షరాస్యత శాతం 52.03%.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 33438. ఇందులో పురుషులు 16859, మహిళలు 16579. జనాభాలో ఇది జిల్లాలోనే అత్యల్ప జనాభా కల మండలం. అక్షరాస్యత శాతం 53.62%. స్త్రీపురుష నిష్పత్తి 983.

అచ్చంపేట నియోజకవర్గంలో
ఉప్పునూతల మండల స్థానం (ఆకుపచ్చ రంగు
రవాణా సౌకర్యాలు:
మండలంలో రైల్వేలైను మరియు ప్రధాన రహదారులు లేవు. మహబూబ్‌నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు ప్రధాన రహదారి మండలానికి దక్షిణం వైపు నుంచి వెళ్ళుచున్నది. అచ్చంపేట నుంచి రవాణా వసతులున్నాయి.

రాజకీయాలు:
ఉప్పునుంతల మండలము అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 1987లో తొలి ఎంపీపీగా కట్టా జనార్థన్ గౌడ్ పనిచేశారు. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.నిరంజన్ రెడ్డి ఎన్నికయ్యారు.2006 సర్పంచి ఎన్నికలలో మండలంలోని 15 గ్రామపంచాయతీలకుగాను కాంగ్రెస్ పార్టీ 10, తెలుగుదేశం పార్టీ 5 పంచాయతీలలో విజయం సాధించాయి. 2014లో ఎంపిపిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అరుణ ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 29 ప్రాథమిక పాఠశాలలు (3 ప్రభుత్వ, 26 మండల పరిషత్తు), 8 ప్రాథమికోన్నత పాఠశాలలు (అన్నీ మండల పరిషత్తు), 12 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 6 జడ్పీ, 5 ప్రైవేట్), ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల ఉన్నది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 22278 హెక్టార్లలో 73% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న, ప్రత్తి.  వరి, వేరుశనగ, జొన్నలు, కందులు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 745 మిమీ. మండలంలో సుమారు 3200 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ:
  • 2014, జూలై 4: ఎంపిపిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అరుణ ఎన్నికయ్యారు.
  • 2021, జూలై 23: పిరట్వానిపలి శివారులో 2 కార్లు ఢీకొని ఏడుగురు మరణించారు. 

ప్రముఖ గ్రామాలు:
అయ్యవారిపల్లి (Ayyavaripally):
అయ్యవారిపల్లి నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలమునకు చెందిన గ్రామము. గ్రామ భౌగోళిక విస్తీర్ణం 528 హెక్టార్లు. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 924. గ్రామంలో 2 ప్రాథమిక పాఠశాలలున్నాయి. 

దాసర్లపల్లి (Dasarlapally):
దాసర్లపల్లి నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామానికి ఉత్తర సరిహద్దు గుండా దుందుభీనది ప్రవహిస్తుంది. గ్రామ భౌగోళిక విస్తీర్ణం 785 హెక్టార్లు. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1006. గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది.

గువ్వలోనిపల్లి (Guvvalonipalli):
గువ్వలోనిపల్లి నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి మరియు ఎంపీటీసి కేంద్రము. దిండిప్రాజెక్టు కుడికాల్వ కింద గ్రామపు ఆయకట్టు ఉంది. గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.

కొరటికల్ (Koratikal):
కొరటికల్ నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలముకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామానికి ఉత్తర సరిహద్దు గుండా దుందుభీనది ప్రవహిస్తుంది. గ్రామ భౌగోళిక విస్తీర్ణం 1416 హెక్టార్లు. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1654. 2013లో గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా జి.సైదమ్మ ఎన్నికయ్యారు. గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.

మామిళ్ళపల్లి (Mamillapalli):
మామిళ్ళపల్లి నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలముకు చెందిన గ్రామము. ఇది పంచాయతి మరియు ఎంపీటీసి కేంద్రము. గ్రామ భౌగోళిక విస్తీర్ణం 964 హెక్టార్లు. గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1467. 2013లో గ్రామ సర్పంచిగా మర్యాద దామోదర్ ఎన్నికయ్యారు. 2014 ఎంపీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.లక్ష్మమ్మ విజయం సాధించారు. గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది.
శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం
దుందుభీ తీరక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీనరసింహస్వామి మామిళ్ళపల్లి గ్రామంలో దుందుభీనది సమీపంలో ఉంది. పూర్వం రైతులు పొలంలో సాగుచేస్తుండగా భూమిలోంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహం బయటపడింది. ఆ విగ్రహాన్ని ఆ ప్రాంతంలో విస్తరించిన మామిడిచెట్ల మధ్యలో ఉంచి ప్రతిష్టించారు. దీనితో ఈ ప్రాంతానికి మామిళ్ళపల్లిగా పేరువచ్చినట్లు కథనం. ఆలయం గాలిగోపురాలపై అపురూపమైన శిల్పసంపద ఉంది.

మర్రిపల్లి (Marripalli):
మర్రిపల్లి నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలముకు చెందిన గ్రామము. ఇది పంచాయతి మరియు ఎంపీటీసి కేంద్రము. గ్రామ భౌగోళిక విస్తీర్ణం 725 హెక్టార్లు. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1754. 2013లో గ్రామ సర్పంచిగా సత్తు రాధికారావు ఎన్నికయ్యారు. 2014 ఎంపీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన భూపాల్ రావు విజయం సాధించారు. గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.

మొల్గర (Molgara) :
మొల్గర నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలమునకు చెందిన గ్రామము. గ్రామానికి ఉత్తర సరిహద్దు గుండా దుందుభీనది ప్రవహిస్తుంది. గ్రామ భౌగోళిక విస్తీర్ణం 580 హెక్టార్లు. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 810. గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది.

పెద్దాపూర్ (Peddapur):
పెద్దాపూర్ నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామానికి ఉత్తర సరిహద్దు గుండా దుందుభీనది ప్రవహిస్తుంది. ప్రముఖ విద్యావేత్తగా, కవిగా పేరుపొందిన పెద్దాపురం రంగారావు, వాగ్గేయకారుడు రాకమచర్ల వెంకటదాసు ఈ గ్రామమునకు చెందినవారు. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1086. 2013లో గ్రామ సర్పంచిగా టి.లక్ష్మమ్మ ఎన్నికయ్యారు. గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది.

పెనిమిళ్ళ (Penmilla):
పెనిమిళ్ళ నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలముకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామానికి ఉత్తర సరిహద్దు గుండా దుందుభీనది ప్రవహిస్తుంది. గ్రామ భౌగోళిక విస్తీర్ణం 3765 హెక్టార్లు.  గ్రామపరిధిలో 434 హెక్టార్ల అటవీప్రాంతం ఉంది. వాగ్గేయకారుడు కందూరి నరసింహకవి ఈ గ్రామమునకు చెందినవారు. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 4201.2013లో గ్రామ సర్పంచిగా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు.

పిరట్వానిపల్లి (Piratvanipalli):
పిరట్వానిపల్లి నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలముకు చెందిన గ్రామము. ఇది పంచాయతి మరియు ఎంపీటీసి కేంద్రము. గ్రామ భౌగోళిక విస్తీర్ణం 552 హెక్టార్లు. ఈ గ్రామంలో పురాతనమైన శిథిల ఆలయం ఉంది. ఇది ఏ దేవునిదో తెలియదు. శాసనం కూడా ఉంది. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1250. 2013లో గ్రామ సర్పంచిగా నీలమ్మ ఎన్నికయ్యారు. 2014 ఎంపీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.భారతి విజయం సాధించారు. గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఒక మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నాయి. 2021, జూలై 23న పిరట్వానిపల్లి శివారులో (హైదరాబాదు-శ్రీశైలం జాతీయ రహదారిపై) రెండుకార్లు ఢీకొని ఏడుగురు మరణించారు.



విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు,  ఉప్పునూతల మండలము, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • పాలమురు ఆధునిక యుగకవుల చరిత్ర (రచన- ఆచార్య ఎస్వి రామారావు),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక