దౌలతాబాద్ వికారాబాదు జిల్లాకు చెందిన మండలము. ఇది తాండూరు రెవెన్యూ డివిజన్, కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. కుదురుమళ్ళ గ్రామశివారులో అల్లారాయప్ప ఆలయం, మండలకేంద్రంలో పెద్ద చెరువు, నీటూరులో నిజాంల కాలం నాటి ఖల్సా ఉన్నాయి. శాసనసభ్యుడిగా పనిచేసిన నందారం సూర్యనారాయణ ఈ మండలమునకు చెందినవారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 51802.
జనాభా
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 42550. ఇందులో పురుషులు 21209, మహిళలు 21341. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 51802. ఇందులో పురుషులు 25989, మహిళలు 25813. అక్షరాస్యుల సంఖ్య 21645. మండల సరిహద్దులు: దౌల్తాబాదు మండలం జిల్లాలో వాయువ్యాన కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్నది. ఉత్తరాన కోడంగల్ మండలం, తూర్పున కోస్గి మండలం, దక్షిణాన మద్దూర్, దామరగిద్ద మండలాలు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి.
ప్రయాణ సౌకర్యాలు
కోడంగల్, కోస్గి, నారాయణపేట నుంచి బస్సు సౌకర్యం ఉంది. కర్ణాటక సరిహద్దులో జిల్లా కేంద్రానికి చాలాదూరంలో ఉండుటచే మరియు ప్రధాన రహదారిపై లేకుండుటచే ప్రయాణ వసతులు అంతంతమాత్రముగానే ఉన్నాయి. హైదరాబాదు-బీజాపూర్ ప్రధాన రహదారి రావల్‌పల్లి నుంచి పైవేటు జీపులు, ఆటోలు ద్వారా మండల కేంద్రానికి చేరుకోవచ్చు. చరిత్ర: నిజాంల కాలంలో మండల పరిధిలోని నీటూరు ఖల్సాగా ఉండేది. వసూలు చేసిన పన్నుల భద్రతకై నీటూరులో కోట, కందకాలు, బురుజులు ఏర్పాటుచేశారు. నిజాం ప్రధానమంత్రి తరుచుగా ఇక్కడికి వచ్చేవారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు పూర్వం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో ఉండేది. 1956లోభాషా ప్రయుక్త రాష్టాల అవతరన సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో కలిసింది. మండల వ్యవస్థకు ముందు ఇది కోడంగల్ తాలుకాలో భాగంగా ఉండేది. 1986లో ప్రత్యేక మండలంగా ఏర్పడింది.
ఈ మండలము కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2004 అసెంబ్లీ ఎన్నికలలో ఈ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీకి 1500 మెజారిటీ లభించగా, 2009లో తెలుగుదేశం పార్టీకి 140 ఓట్ల మెజారిటీ వచ్చింది. 2001 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన శారదమ్మ, 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బి.మోహన్ రెడ్డి విజయం సాధించారు. 2014లో ఎంపీపీగా తెలుగుదేశం పార్టీకి చెందిన నర్సింగ్ బాల్‌సింగ్ ఎన్నికయ్యారు. వ్యవసాయం, పంటలు: దౌల్తాబాదు మండలం మొత్తం విస్తీర్ణం 18304 హెక్టార్లలో 66శాతం భూభాగంలో పంటసేద్యానికి అనువుగా ఉన్నది. ఈ మండలంలో పండే ప్రధాన పంట కందులు. ఆ తర్వాత జొన్నలు, మినుములు, వరి అధికంగా పండిస్తారు. వేరుశనగ కూడా కొంత భూభాగంలో పండుతుంది.మండల సాధారణ వర్షపాతం 661 మిమీ. మండలంలో సుమారు 2500 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 56 ప్రాథమిక పాఠశాలలు (54 మండల పరిషత్తు, ఒకటి ఎయిడెడ్, ఒకటి ప్రైవేటు), 10 ప్రాథమికోన్నత పాఠశాలలు (9 మండల పరిషత్తు, ఒకటి ప్రైవేటు), 7 ఉన్నత పాఠశాలలు (5 జడ్పీ, ఒకటి ప్రభుత్వ, ఒకటి ప్రైవేటు), ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉన్నాయి.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
దౌల్తాబాదు మండలము(Doulthabad Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి