మద్దూరు నారాయణపేట జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది నారాయణపేట రెవెన్యూ డివిజన్ లో భాగముగా ఉన్నది. కోస్గి నుంచి నారాయణపేట వెళ్ళు రహదారి మద్దూరు మండలం నుంచి వెళ్ళుతుంది. మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో గిరిజనుల ఆరాధ్యదైవం బావోజి మఠం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 67470. ఈ మండలము నారాయణపేట రెవెన్యూ డివిజన్, కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో పేరుగాంచిన పల్లెర్ల వంశం పూర్వీకులు మండలంలోని పల్లెర్ల గ్రామానికి చెందినవారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.
మండల సరిహద్దులు: ఈ మండలమునకు ఉత్తరమున దౌల్తాబాదు, కోస్గి మండలములు, తూర్పున కోయిలకొండ మండలము, దక్షిణమున కోయిలకొండ, నారాయణపేట మండలములు, పశ్చిమాన దామరగిద్ద మండలము సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 59593. ఇందులో పురుషులు 29881, మహిళలు 29732. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 67470. ఇందులో పురుషులు 33686, మహిళలు 33784. అక్షరాస్యుల సంఖ్య 27920. రవాణా సౌకర్యాలు: నారాయణపేట నుంచి కోస్గి వెళ్ళు రహదారి మండలం నుంచి వెళ్ళుతుంది. మద్దూరు నుంచి దౌల్తాబాద్, కోయిలకొండ వెళ్ళుటకు కూడా రహదారులున్నాయి. ప్రతిపాదనలొ ఉన్న వికారాబాదు-కృష్ణా రైలుమార్గం కూడా మండలం నుంచి వెళ్ళుతుంది. చరిత్ర: ఈ ప్రాంతము మొదట కర్ణాటకలో భాగంగా ఉండేది. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల అవరతణ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది. 1986వరకు కోడంగల్ తాలుకాలో ఉన్న ఈ ప్రాంతం 1986లో మద్దూరు మండలంలో చేరాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.
ఈ మండలము కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2001 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.విజయలక్ష్మి, 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన బాల్‌సింగ్ విజయం సాధించారు. 2014లో ఎంపీపీగా తెలుగుదేశం పార్టీకి చెందిన సంగీత ఎన్నికయ్యారు.
వ్యవసాయం, నీటిపారుదల
మండలం మొత్తం విస్తీర్ణం 20427 హెక్టార్లలో 69% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంటలు కందులు, జొన్నలు. పెసర్లు, వరి, వేరుశనగా కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 548మిమీ. మండలంలో సుమారు 2400 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 71 ప్రాథమిక పాఠశాలలు (69 మండల పరిషత్తు, 2 ప్రైవేట్), 17 ప్రాథమికోన్నత పాఠశాలలు (13 మండల పరిషత్తు, 4 ప్రైవేట్), 10 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 6 జడ్పీ, 3 ప్రైవేట్), ఒక జూనియర్ కళాశాల ఉన్నది. కాలరేఖ:
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
మద్దూరు మండలము (Maddur Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి