22, జనవరి 2013, మంగళవారం

గట్టు మండలం (Ghattu Mandal)

జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా
రెవెన్యూ డివిజన్ గద్వాల
జనాభా72967 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంగద్వాల
లోకసభ నియోజకవర్గంనాగర్ కర్నూల్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలువరి, వేరుశనగ
మండల ప్రముఖులగట్టు భీముడు

గట్టు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలము. కృష్ణా, గోదావరి నదుల మధ్యప్రాంతమైన నడిగడ్డలోని 9 మండలాలలో ఒకటి. పశ్చిమాన కర్ణాటక సరిహద్దును కలిగి ఉంది. ఈ మండలము గద్వాల రెవెన్యూ డివిజన్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 1999లో గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొందిన గట్టు భీముడు, డిసిసిబి చైర్మెన్‌గా పనిచేసిన గట్టు తిమ్మప్పలు ఈ మండలానికి చెందినవారు. పెంచికలపాడు వద్ద గట్టు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు.

భౌగోళికం, సరిహద్దులు:
గట్టు 16 డి 7 ని 30 సె ఉత్తర అక్షాంశంపై, 77 డి 40 ని 15 సె తూర్పు రేఖాంశంపై ఉంది. గట్టు మండలానికి ఉత్తరాన ధరూరు మండలం, తూర్పున మల్డకల్, అయిజ మండలాలు, దక్షిణమున,ఆగ్నేయాన అయిజ మండలాలు ఉండగా పశ్చిమాన కర్ణాటక రాష్ట్రపు రాయచూరు జిల్లా సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 72967. ఇందులో పురుషులు 36206, మహిళలు 36761. జనాభాలో ఇది జిల్లాలో 10వ స్థానంలో ఉంది. స్త్రీపురుష నిష్పత్తిలో (1015/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో మూడవ స్థానంలో ఉంది. అక్షరాస్యత శాతం 34.45%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో చివరి నుంచి తొలిస్థానంలో ఉంది. (రాష్ట్రంలోనే చివరిస్థానంలో).

రవాణా సౌకర్యాలు:
గద్వాల నుంచి రాయచూరు మీదుగా వెళ్ళు రోడ్డు మార్గం గట్టు మండలంలోని నందిన్నె మీదుగా వెళ్ళుతుంది. కర్నూలు నుంచి రాయచూరు వెళ్ళు మార్గం కూడా మండలం మీదుగా వెళ్తుంది. గద్వాల నుంచి ధరూరు మీదుగా గట్టు మండల కేంద్రానికి రోడ్డు సదుపాయం ఉంది.

గద్వాల నియోజకవర్గంలో
ఘట్టు మండల స్థానం (ఎరుపు రంగు)
రాజకీయాలు:
ఈ మండలము గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుదర్శన్ ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 39 ప్రాథమిక పాఠశాలలు (38 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 14 ప్రాథమికోన్నత పాఠశాలలు (అన్నీ మండల పరిషత్తు), 8 ఉన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 6 జడ్పీ), ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల ఉన్నది. ఘట్టు మండలంలో నందిన్నె, ఆలూరు, ఘట్టు, మాచర్ల, చాగదోన, చింతలకుంటలలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఘట్టు మండల కేంద్రంలో బాలికల గురుకుల పాఠశాల ఉంది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 34812 హెక్టార్లలో 62% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వరి, వేరుశనగ. పండ్లు, కందులు, ప్రత్తి కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 404 మిమీ. మండలంలో సుమారు 8500 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

గట్టు మండలంలోని గ్రామపంచాయతీలు
1.ఆరగిద్ద9.గొర్లఖాన్ దొడ్డి17.బల్గెర
2.ఆలూరు10.చాగదోన18.బోయెలగూడెం
3.ఇందువాసి11.చింతకుంట19.మాచర్ల
4.ఇర్సాన్ దొడ్డి12.తప్పెట్లమరుసు20.మాలంపల్లి
5.ఎల్లమ్మదొడ్డి13.తుమ్మలచెరువు21.మాలాపురం (హెచ్)
6.కల్లుర్ తిమ్మన్ దొడ్డి14.తుమ్మలపల్లి (హెచ్)22.మిట్టదొడ్డి
7.కుంచెర్ల15.నందిన్నె23.రాయపూర్
8.గట్టు16.పెంచికలపాడు24.లింగాపూర్

విభాగాలు: జోగులాంబ గద్వాల జిల్లా మండలాలు,  గట్టు మండలము, గద్వాల రెవెన్యూ డివిజన్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక