22, జనవరి 2013, మంగళవారం

అచ్చంపేట మండలం (Achampet Mandal):

జిల్లా నాగర్‌కర్నూల్
రెవెన్యూ డివిజన్ అచ్చంపేట
జనాభా57313 (2001)
68888 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంఅచ్చంపేట
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూలు
పర్యాటక ప్రాంతాలుఉమామహేశ్వరస్వామి దేవాలయం ,
ముఖ్య పంటలుమొక్కజొన్న, ప్రత్తి
మండల ప్రముఖులుమర్యాద గోపాలరెడ్డి
అచ్చంపేట నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము నల్లమల అడవులలో భాగము. మండల పరిధిలో వంకేశ్వరం, లక్ష్మాపూర్ గ్రామాల మధ్య నల్లమల కొండలలో శిల్పకళా సంపదకు నిలయమైన నవనారసింహాలయం ఉంది. మహబూబ్ నగర్-శ్రీశైలం ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచుండగా, ఈశాన్యవైపున దిండినది సరిహద్దుగా ప్రవహిస్తోంది. మండలం తూర్పు భాగములో దట్టమైన అడవులు ఉన్నాయి. ఇవి నల్లమల అడవులలో భాగము. ఈ మండలం నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గము, నాగర్‌కర్నూలు లోకసభ నియోజకవర్గములో భాగము. ప్రముఖమైన ఉమామహేశ్వరస్వామి దేవాలయం మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఉంది. రంగాపూర్‌లో హజ్రత్ నిరంజన్ షావలీ దర్గా కూడా ఉంది. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామపంచాయతీలు, మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, ఒక పురపాలక సంఘం ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 68888.

మండల సరిహద్దులు:
అచ్చంపేట మండలమునకు ఈశాన్యమున దిండినది, నల్గొండ జిల్లా, దక్షిణమున అమ్రాబాదు మండలము, నైరుతివైపున బల్మూరు మండలం, వాయువ్యాన ఉప్పునుంతల మండలము సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 57313. ఇందులో పురుషులు 29411, మహిళలు 27902.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 68888. ఇందులో పురుషులు 35550, మహిళలు 33338. పట్టణ జనాభా 28384, గ్రామీణ జనాభా 40504. జనాభాలో ఇది జిల్లాలో 14వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
హైదరాబాదు నుంచి మరియు మహబూబ్ నగర్ నుండి శ్రీశైలం వెళ్ళు ప్రధాన రహదారి మండలం గుండా అచ్చంపేట, రంగాపూర్ మీదుగా వెళుతుంది.  అచ్చంపేటలో ఆర్టీసీ బస్సుడిపో కూడా ఉంది.

అచ్చంపేట నియోజకవర్గంలో
అచ్చంపేట మండల స్థానం (గులాబి రంగు)
రాజకీయాలు:
ఈ మండలము అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గము, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గములో భాగము. జిలాపరిషత్తు వైస్-చైర్మెన్‌గా పనిచేసిన మర్యాద గోపాలరెడ్డి ఈ మండలమునకు చెందినవారు. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన పోకల మనోహర్ ఎన్నికయ్యారు. 2014 ఎంపీటీసి ఎన్నికలలో మండలంలో మొత్తం 12 ఎంపీటీసి స్థానాలకుగాను తెలుగుదేశం పార్టీ 6, కాంగ్రెస్ పార్టీ 4, తెరాస 2 స్థానాలలో విజయం సాధించాయి. ఎంపిపి పదవి తెలుగుదేశం పార్టీకి చెందిన పర్వతాలుకు లభించింది.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 67 ప్రాథమిక పాఠశాలలు (10 ప్రభుత్వ, 41 మండల పరిషత్తు, 16 ప్రైవేట్), 20 ప్రాథమికోన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 14 మండల పరిషత్తు, 4 ప్రైవేట్), 22 ఉన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 5 జడ్పీ, 15 ప్రైవేట్), 4 జూనియర్ కళాశాలలు (2 ప్రభుత్వ, 2 ప్రైవేట్) ఉన్నవి.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 60697 హెక్టార్లలో 10% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. 55% భూమి అటవీ ప్రాంతము. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న, ప్రత్తి.  వరి, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 709 మిమీ. మండలంలో సుమారు 1500 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ:
 • 2013, జూన్ 25: అచ్చంపేట మేజర్ గ్రామపంచాయతిని నగరపంచాయతిగా మారుస్తూ ఉత్తర్వు జారీ. (జివో 290/25-06-2013) 
 • 2014, జూలై 4: 2014లో ఎంపిపిగా తెలుగుదేశం పార్టీకి చెందిన పర్వతాలు ఎన్నికయ్యారు. 
 • 2016, మార్చి 10: అచ్చంపేట నగరపంచాయతి ఎన్నికల ఫలితాలలో మొత్తం 20 వార్డులను తెరాస కైవసం చేసుకుంది. 
 • 2017, అక్టోబరు 11: జిల్లాల పునర్వ్యవస్థీకరనలో భాగంగా ఈ మండలం నాగర్‌కర్నూల్ జిల్లాలో భాగమైంది. అచ్చంపేట రెవెన్యూ డివిజన కేంద్రంగా మారింది.
మండలంలోని గ్రామాలు:
లింగోటం (Lingotam), తంగాపుర్ (Tangapur), నాదింపల్లి (Nadimpalli), అచ్చంపేట (Achampet), చౌటపల్లి (Choutapalli), గుంపంపల్లి (Gumpampalli), లక్ష్మాపుర్ (Lakshmapur) (P.N), పాకులపల్లి (Palukapalli), బొల్‌గాట్‌పల్లి (Bolghatpalli), బ్రాహ్మణపల్లి (Brahmanapalli), పులిజాల (Puljala), హాజీపూర్ (Hajipur), రంగాపూర్ (Rangapur), చందాపూర్ (Chandapur), చెన్నారం (Chennaram) (Sabak), సింగవరం (Singavaram), ఐనోల్ (Ainole), బొమ్మెనపల్లి (Bommenapalli), సిద్ధాపూర్ (Siddapur), మన్నెవారిపల్లి (Mannavaripalli), ఘన్‌పూర్ (Ghanapur), అక్కవరం (Akkavaram)

ఫోటో గ్యాలరీవిభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు,  అచ్చంపేట మండలము,   అచ్చంపేట రెవెన్యూ డివిజన్,   అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం

= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
 • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
 • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
 • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011. 
 • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
 • బ్లాగు రచయిత పర్యటించి, తెలుసుకున్న విషయాలు, 
 • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు G.O.Ms.No.243 Dt: 11-10-2016

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక