హన్వాడ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా తాండూర్ వెళ్ళు రహదారిలో ఉంది. ఈ మండలము మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు, 19 గ్రామపంచాయతీలున్నాయి. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 54915. 2012లో చిన్నదర్పల్లి పంచాయతి మహబూబ్‌నగర్ పురపాలకలో విలీనం చేయబడింది.
మండల సరిహద్దులు: ఈ మండలమునకు ఉత్తరము రంగారెడ్డి జిల్లా, తూర్పున నవాబ్ పేట మండలము, దక్షిణమున మహబూబ్ నగర్, కోయిలకొండ మండలములు, పశ్చిమమున కోయిలకొండ మండలము సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 44545. ఇందులో పురుషులు 22483, మహిళలు 22062. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 54915. ఇందులో పురుషులు 27554, మహిళలు 27361. అక్షరాస్యుల సంఖ్య 23666. రవాణా సౌకర్యాలు: మహబూబ్ నగర్ నుంచి తాండూరు వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. చిన్నదర్పల్లి, హన్వాడ, ఇబ్రహీంబాద్ ఈ రహదారిపై ఉన్న గ్రామాలు.
రాజకీయాలు
ఈ మండలం మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో పరిధిలోకి వస్తుంది. నియోజకవర్గాల పునర్విభజనకు పూర్వం మండలంలోని 12 గ్రామపంచాయతీలు జడ్చర్ల నియోజకవర్గం పరిధిలో ఉండగా, 8 గ్రామపంచాయతీలు మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ఉండేవి. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండుటచే ఇక్కడి రాజకీయాలపై జిల్లా కేంద్రపు ప్రభావం ఉంది. ప్రధాన రాజకీయ పక్షాలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీలు.
విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 49 ప్రాథమిక పాఠశాలలు (4 ప్రభుత్వ, 43 మండల పరిషత్తు, 2 ప్రైవేట్), 9 ప్రాథమికోన్నత పాఠశాలలు (6 మండల పరిషత్తు, 3 ప్రైవేట్), 13 ఉన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 9 జడ్పీ, 2 ప్రైవేట్), ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల ఉన్నది.
వ్యవసాయం,నీటిపారుదల
మండలం మొత్తం విస్తీర్ణం 16322 హెక్టార్లలో 52% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. 27% భూమి అటవీ ప్రాంతం. మండలంలో పండించే ప్రధాన పంటలు జొన్నలు, కందులు. వరి, వేరుశనగా కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 669 మిమీ. మండలంలో సుమారు 2600 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.
అధ్యాత్మికం: మండలంలోని మాధారం పంచాయతి పరిధిలో రాకంకొండ శ్రీతిరుమలనాథస్వామి దేవాలయం ఉంది. మండల కేంద్రంలో పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయం ఉంది. కాలరేఖ:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
హన్వాడ మండలము (Hanwada Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి